అమ్మకాలు నిలిపివేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్,కానీ…  

Johnson Johnson Us And Canada - Telugu Baby Powder, Coronavirus, Ohnson & Johnson, Us And Canada

ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తమ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపి వేయనున్నట్లు తెలుస్తుంది.అయితే అమెరికా,కెనడా దేశాల్లో మాత్రమే తమ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లుస్ సమాచారం.

 Johnson Johnson Us And Canada

ప్రముఖ సంస్థ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పలు కేసులు కూడా నమోదు అవ్వగా, కొన్ని సంవత్సరాలు పాటు సాగిన కోర్ట్ వివాదాల తర్వాత సంస్థ కొన్ని కోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించవలసి వస్తోంది.

ఇంతగా సంస్థ ఉత్పత్తులపై ఆరోపణలు వస్తున్నప్పటికీ మాత్రం ఆ సంస్థ తమ ఉత్పత్తులు సురక్షితమైనవేనని సమర్ధించుకుంటూనే వస్తోంది.అయితే కారణాలు ఏవైనా కానీ ప్రస్తుతం ఈ సంస్థ అమెరికా కన్స్యూమర్ వ్యాపారంలో 0.5 శాతం ఉండే టాల్క్ అమ్మకాలని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తామని ప్రకటించింది.

అమ్మకాలు నిలిపివేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్,కానీ…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్న సరుకుల్ని మాత్రం రిటైల్ మార్కెట్లో అమ్ముతారని తెలిపింది.

సంస్థ టాల్కం పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నాయన్న ఆరోపణలతో మొత్తం 16,000 కేసులను ఎదుర్కొంటోంది.ప్రజల అలవాట్లు మారడం వలన, తమ ఉత్పత్తుల సురక్షణ పట్ల తప్పుడు సమాచారం ప్రచారం కావడం వలన కంపెనీ ఉత్పత్తులకు నార్త్ అమెరికాలో డిమాండ్ తగ్గిందని,సంస్థపై కేసులు వేయడానికి వినియోగదారులని న్యాయవాదులు ప్రోత్సహించారని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా పరిశీలించి తమ సంస్థ తయారు చేసే ఉత్పత్తుల సురక్షిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని వైద్య నిపుణులు ధృవీకరించినట్లు తెలిపింది.అయితే.కరోనా వైరస్‌తో తలెత్తిన పరిస్థితుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.జాన్సన్ అండ్ జాన్సన్ టాల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన 22 మంది మహిళలకు 4,700 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని 2018లో కోర్టు ఆదేశించగా,ఈ నిర్ణయంపై సదరు సంస్థ రివ్యూ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు