జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో డెల్టా వెరియంట్ కి చెక్..!

కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలు కంగారు పడుతున్నారు.అయితే తాజా అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

 Johnson And Johnson Vaccine Work With Delta Variant, Corona Delta Variant, Covid-TeluguStop.com

కరోనా వ్యాప్త్ చేసే డెల్టా వేరియంట్ పై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.అమెరికాలో ఓ లాబొరేటరీలో జరిపిన ఈ టెస్టింగ్ లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ డెల్తా వేరియంట్ ను పూర్తి స్థాయిలో ఎదుర్కుంటుందని దాన్ని నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు.

ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.వ్యాక్సిన్ ప్రభావం దాదాపు 8 నెలల పాటు ఉంటుందని ఆ తర్వాత మరో సింగిల్ బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

సార్స్ కొవ్ 2 వేరియంట్ల పై జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని.యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి చేసి డెల్టా వేరియంట్ ను నిర్వీర్యం చేస్తుందని రిపోర్టుల్లో చెప్పారు.

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ దక్షిణాఫ్రికా లో బీటా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ పై మంచి పభావం చూపుతుందని టెస్టింగ్ లో స్పష్టమైనది.ఈ వ్యాక్సిన్ తీసుకున్న 85 శాతం మందిలో వైరస్ ప్రాణాతకంగా మారదని అంటున్నారు.క్లినికల్ డేటా సమాచారం మేరకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రభావంపై ఓ అంచనాకు వచ్చారని తెలుస్తుంది.8 నెలలు కచ్చితంగా రక్షణ కల్పిస్తుందని శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube