ఆ పౌడర్‌ వాడటంతో క్యాన్సర్‌ బారిన పడింది.. కోర్టును ఆశ్రయించి వందల కోట్ల నష్టపరిహారం పొందింది

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ ఉన్న పిల్లల పౌడర్‌ మరియు ట్యాల్కమ్‌ పౌడర్‌ జాన్సన్స్‌ పౌడర్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిన్న పిల్లల పౌడర్‌ అంటే ఇండియాలో అత్యధికులు వినియోగించేది జాన్సన్స్‌ పౌడర్‌.

 Johnson And Johnson Hit With 29 Million Verdict In Talc Cancer Case-TeluguStop.com

అలాంటి పౌడర్‌లో ప్రాణాలకు హాని కలిగించే రసాయనాలు ఉన్నాయని టెర్రీ అనే ఒక మహిళ నిరూపించింది.ఆమె చాలా కాలంగా జాన్సన్స్‌ పౌడర్‌ వాడుతుందట.2017వ సంవత్సరంలో ఆమె క్యాన్సర్‌ బారిన పడింది.తాను క్యాన్సర్‌ బారిన పడటానికి కారణం జాన్సన్స్‌ పౌడర్‌ వాడటమే అని ఆమె నిర్ధారణకు వచ్చింది.

దాంతో అప్పుడే జాన్సన్స్‌ కంపెనీపై కేసు నమోదు చేసింది.

జాన్సన్స్‌ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ అనే ప్రమాదకర రసాయనం ఉందని, ఆ రసాయనం వల్ల చర్మంకు సంబంధించిన క్యాన్సర్‌తో పాటు పలు రకాల జబ్బులు వస్తున్నాయని ఆమె ఆరోపించింది.

ఈ విషయాలపై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపి, పరిశోదనల ఫలితాలను సేకరించిన తర్వాత అప్పుడు తుది తీర్పు ఇవ్వడం జరిగింది.ఆమెకు అనుకూలంగా జాన్సన్స్‌ కంపెనీకి దిమ్మ తిరిగేలా కోర్టు తీర్పు ఇచ్చింది.ఆమెకు జరిగిన నష్టం తీర్చలేనిది, ఆమెకు ఎంత పరిహారం ఇచ్చినా కూడా ఇప్పుడున్న సమయంలో అది వృదా అని, ఆమెకు తిరిగి పూర్తి ఆరోగ్యంను ఇవ్వలేని జాన్సన్స్‌ కంపెనీ కనీసం ఆమెకు 29 మిలియన్‌ల డాలర్లు(రూ.201 కోట్లు) చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

జాన్సన్స్‌ పౌడర్‌లో ఉన్న రసాయనం వల్ల తాము కూడా అనారోగ్యం బారిన పడ్డట్లుగా ఇప్పటి వరకు 11 మంది కోర్టును ఆశ్రయించగా అయిదుగురి కేసును కోర్టు కొట్టి వేయగా, మూడు కేసుల్లో జాన్సన్స్‌ వారికి జరిమానా విధించడం జరిగింది.ఇంకా కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో జాన్సన్స్‌ పౌడర్‌ ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంది.ఆ కేసుల్లో కూడా దోషిగా తేలితే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube