సుమపై షాకింగ్ పంచ్ లు వేసిన జోగి బ్రదర్స్.. రాత్రంతా పడుకోదంటూ?

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన సుమకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Jogi Brothers Shocking Punches About Suma Details Here Goes Viral, Anchor Suma,jogi Brothers,cash Show, Cash Latest Promo,suma Jogi Brothers,suma Punches-TeluguStop.com

తాజాగా క్యాష్ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ షోకు రాగిణి, కాదంబరి కిరణ్, జోగి బ్రదర్స్ అయిన కృష్ణంరాజు, జోగి నాయుడు హాజరయ్యారు.జోగి బ్రదర్స్ డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు స్టెప్పులు వేసి ప్రోమోకు హైలెట్ గా నిలిచారు.

ఇన్నేళ్లలో కూడా అవే స్టెప్పులు ఏమీ మారలేదని సుమ చెప్పగా కృష్ణంరాజు నువ్వు యాంకరింగ్ ఏమైనా మార్చావా ఏంటి అంటూ పంచ్ వేశారు.అతను వేసిన పంచ్ కు తల దించుకోవడం సుమ వంతైంది.

 Jogi Brothers Shocking Punches About Suma Details Here Goes Viral, Anchor Suma,jogi Brothers,cash Show, Cash Latest Promo,suma Jogi Brothers,suma Punches-సుమపై షాకింగ్ పంచ్ లు వేసిన జోగి బ్రదర్స్.. రాత్రంతా పడుకోదంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుమ క్యాష్ ఫ్యామిలీ షో అని చెప్పగా ఫ్యామిలీస్ ను ఎందుకు పిలవలేదంటూ జోగి బ్రదర్స్ పంచ్ లు వేశారు.జోగి నాయుడు సుమ తెలుసు కదా అని అడగగా కృష్ణంరాజు నేను చిన్నప్పుడు ఆ అమ్మాయి యాంకరింగ్ ను చూసేవాడినని పంచ్ వేశారు.

జోగి నాయుడు సుమ ముందుగానే అనుకొని పంచ్ వేస్తుందా లేక స్పాంటేనియస్ గా వేస్తుందా అని అడగగా కృష్ణంరాజు సుమ పడుకోదని రాత్రంతా పంచ్ లు ప్రాక్టీస్ చేసి పొద్దున్నే ఆ పంచ్ లు వేస్తుందంటూ ఆమె పరువు తీసేశారు.మనం ఆమె దగ్గర పంచ్ లు నేర్చుకుందామా అని జోగి నాయుడు అడగగా మనం ఆమె దగ్గర నేర్చుకోలేమని మనకు మలయాళం అర్థం కాదని కృష్ణంరాజు పంచ్ వేశారు.

ఆ తర్వాత క్యాష్ షోకు సమీర్ కాంట్రాక్టర్ అని సుమ డబ్బులు ఇవ్వడం లేదని ఇన్నిసార్లు క్యాష్ షోకు సమీర్ వస్తున్నాడంటూ కృష్ణంరాజు పంచ్ వేయడం గమనార్హం.ఈ నెల 4వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ప్రోమోకు పంచ్ లు అద్భుతంగా ఉండగా ఈ ప్రోమోకు వ్యూస్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube