68 ఏళ్ళు జైలు జీవితం గడిపిన వ్యక్తి.. విడుదలై బయటకు వచ్చేసరికి..?!

దాదాపు 7 దశాబ్దాల పాటు జువనైల్ జైలు శిక్ష అనుభవించిన జో లైగాన్ అనే ఓ ఖైదీ ఇటీవలే పెన్సిల్వేనియా కారాగారం నుంచి విడుదల అయ్యాడు.ఫిలడెల్ఫియా వీధుల్లో ఆకతాయిగా తిరుగుతూ కొందరు రౌడీ యువకులతో స్నేహం చేసిన లైగాన్.

 Joe Ligon Released From Pennsylvania Jail After 68 Years, 15 Years Age, Jail, Af-TeluguStop.com

ఒకరోజు 8 మందిని కత్తులతో పొడిచి చంపిన ఘటనలో కీలక పాత్ర పోషించాడు.దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

అయితే విచారణలో లైగాన్ బాగా తప్ప తాగి ఇద్దరు మనుషులను ఘోరాతి ఘోరంగా పొడిచి చంపేశాడు అని తేలింది.

కానీ తాను ఎవరిని చంపలేదని, ఘటన జరుగుతున్నప్పుడు తాను తాగిన మత్తులో ఉన్నానని.

బహుశా ఒకరి కడుపులో కత్తి గుచ్చి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు.ఆయన తరపు న్యాయవాదులు కూడా తమ క్లయింట్ ఎటువంటి నేరం చేయలేదని వాదించారు.

కానీ న్యాయస్థానం మాత్రం అతన్ని దోషి గా తేల్చి జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధించింది.దీనితో లైగాన్ 68 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు.

చాలా సార్లు సత్ప్రవర్తన కారణంగా అతన్ని పెరోల్ మీద బయటకు విడిచి పెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది.కానీ అసలైన స్వేచ్ఛ అంటే పెరోల్ మీద విడిచిపెట్టడం కాదని తనని శాశ్వతంగా విడుదల చేయాలని లైగాన్ పట్టుబట్టాడు.

Telugu Age, Jail, Joe Ligon, Payroll-Latest News - Telugu

చివరికి తన లాయర్ సహాయంతో 68 సంవత్సరాల తర్వాత జైలు నుంచి అతడు రిలీజ్ కాబడ్డాడు.ఇప్పుడు అతని వయసు 83 సంవత్సరాలు.అయితే 1953 లో అనగా సుమారు 70 సంవత్సరాల క్రిందటి అమెరికా.ఇప్పుటి అమెరికా ని పోల్చి చూస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది.ఆకాశాన్నంటే భవనాలు, విలాసవంతమైన కార్లు, పెరిగిపోయిన ట్రాఫిక్, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రజల వేషధారణ తదితర మార్పులను మొదటిసారిగా గమనించిన జో లైగాన్ ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.జైల్లోనే 68 ఏళ్ళు గడిపిన ఆయన బాహ్య ప్రపంచం లోని మార్పులను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాడు.

అయితే నునుగు మీసాలతో యువకుడిగా జైల్లో అడుగుపెట్టిన ఆయన 83 ఏళ్ల వయసులో బోసి మొహంతో, నెరిసిన జుట్టుతో బయట ప్రపంచంలోకి వచ్చాడు.బయట ఉన్న సరికొత్త పరిస్థితులకు అనుగుణంగా తన జీవిత శైలిని మార్చుకుంటున్నాడు.

ఐతే ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా నిలిచి అతని అవసరాలు తీరుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube