బైడెన్ ప్రమాణ స్వీకారం సరే: ట్రంప్ బిచాణా సర్దేది ఎప్పుడు..?

ఎన్నికల్లో విజయం తనదేనని వాదించినా.అధికార బదలాయింపుకు ససేమిరా అన్నా.

 Trump Plans To Leave Washington On Morning Of Inauguration Day, Donald Trump, Jo-TeluguStop.com

చివరికి తన మద్ధతుదారులతో క్యాపిటల్ భవనంపై దాడి చేయించినా తను అనుకున్నది సాధించలేకపోయారు ట్రంప్.చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయనకు త్వరగానే బోధపడింది.

ఈ నేపధ్యంలోనే ట్రంప్ తన ఓటమిని అంగీకరించారు.అంతేనా ఆయనను పదవిలోంచి దించడానికి అభిశంసన ప్రక్రియ కూడా ఓపక్క జరుగుతోంది.

ఇన్ని పరిణామాల మధ్యే జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నెల 20న ఆయన దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు.

కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరు వెళ్లిపోవడం సహజం.అలాగే వైట్‌హౌస్‌లోకి కొత్త దేశాధినేత వస్తుండటంతో పదవిలోంచి దిగిపోతున్న ట్రంప్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలి.

దీనిలో భాగంగానే బైడెన్ ప్రమాణ స్వీకారం రోజునే ట్రంప్ వాషింగ్టన్ నుంచి వెళ్లిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ట్రంప్‌, బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో రాజధాని వాషింగ్టన్‌ వెలుపల ఉన్న ఎయిర్‌‌ఫోర్స్‌ వన్‌ ప్రధాన కార్యాలయం జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ వద్ద ట్రంప్‌ వీడ్కోలు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.మాజీగా మారిన తర్వాత.

ఫ్లోరిడా పామ్‌ బీచ్‌లోని తన మార్‌ ఏ లాగో క్లబ్‌లో ట్రంప్‌ నూతన అధ్యాయాన్ని ప్రారంభించనున్నారని సమాచారం.కొంత మంది వైట్‌హౌస్‌ సిబ్బంది ట్రంప్‌ కోసం అక్కడ పని చేస్తారని తెలుస్తోంది.

Telugu Donald Trump, Joe Biden, Joe Biden Oath, Trumpleave, White Officials-Telu

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే వైట్‌హౌస్‌లో సమావేశం నిర్వహించి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు వైట్‌హౌస్ సలహాదారులు డొనాల్డ్ ట్రంప్‌ను కోరుతున్నారు.అయితే ట్రంప్ అలా చేయటానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.మరోవైపు త్వరలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న కమలా హారిస్‌ను. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ అభినందించారు.ఈ మేరకు గురువారం ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు వైట్‌హౌస్ అధికారి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube