బిడెన్ : ప్లీజ్...నన్ను నమ్మండి...సహకరించండి...!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కరోనా మహమ్మారి పై పోరులో అందరూ సహకరించాలని కోరారు.ఒక్కడి వలన ఏమీ కాదని అందరి కృషి ఉంటేనే కరోనాని తరిమికొట్టచ్చని పిలుపునిచ్చారు.

 Joe Biden Urges Americans To Take Vaccine, Joe Biden, Americans, Pfizer Vaccine,-TeluguStop.com

ఈ ఏడాది చివరికల్లా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతుందని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని బిడెన్ అన్నారు.నిన్నటి రోజున మిచిగావ్ లోని కలాంజూలో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ కేంద్రంలో పర్యటన చేసిన బిడెన్ అక్కడి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పై నిపుణులతో చర్చలు జరిపారు.తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కరోనా వ్యాక్సిన్ ను మరింతగా అందించేలా ఉత్పత్తిని పెంచేపనిలో నిపుణులు పనిచేస్తున్నారు.ఎన్ని టీకాలు అవసరమైనా సరే సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని బిడెన్ అన్నారు.

గతంలో కంటే కూడా ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని అధికారులు అందరూ సహకరిస్తున్నాయని కానీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విషయంలో సహకరించాలని కోరారు.అందరూ సహకరిస్తేనే మహమ్మారిని కట్టడిచేయగలమని కోరారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ సరిపడా ఉందని జులై చివరి నాటికి మరో 600 మిలియన్ డోసులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందించామని బిడెన్ ప్రకటించారు.ఇదిలాఉంటే

Telugu Doses, America, Americans, Covid Vaccine, Joe Biden, Joebiden, Pfizer Vac

నెల రోజుల కాలంగా వ్యాక్సిన్ ప్రక్రియకు విఘాతం కలిగిందని, కేవలం మంచు ప్రభావం వలెనే వ్యాక్సినేషన్ సకాలంలో వేయలేకపోతున్నామని, ఈ కారణంగా సుమారు 60 లక్షల డోసులు వేయడం ఆగిపోయిందని బిడెన్ తెలిపారు.ప్రతీ రోజు 1.7 మిలియన్ డోసులు అమెరికా వ్యాప్తంగా వేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే 100 రోజుల్లో 100 మిలియన్ డోసులు వేసి లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటామని తెలిపారు.తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని అలాగే అదే నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి అమెరికాలో కరోనా ఊసే ఉండదని బిడెన్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube