హెల్త్ కేర్ ఎన్‌రోల్‌మెంట్.. జనానికి మీరైనా చెప్పండి: ఒబామా సాయం కోరిన జో బైడెన్

ప్రస్తుతం కరోనా సంక్షోభం నేపథ్యంలో ఒబామాకేర్ హెల్త్‌కేర్ కవరేజ్‌ను పొందేందుకు గాను ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.తన మాజీ బాస్ బరాక్ ఒబామాను సాయం కోరారు.

 Joe Biden Turns To Barack Obama To Help Boost Health Care Enrollment, Biden, Oba-TeluguStop.com

దీనిలో భాగంగా జూమ్ మాధ్యమం ద్వారా బైడెన్.ఒబామాతో చర్చించారు.

ఒబామా హెల్త్ కేర్ రిజిస్ట్రేషన్‌ గడువును ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.అయితే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సైన్ అప్‌లు జరగడం లేదు.

దీనిని ప్రొత్సహించేందుకు బైడెన్ రంగంలోకి దిగారు.ఇదే సమయంలో దేశంలో దాదాపు 31 మిలియన్ల మంది అమెరికన్లకు ఒబామాకేర్ ద్వారా హెల్త్ కవరేజి కలిగి వున్నారని ప్రభుత్వం తెలిపింది.

అటు బైడెన్ విజ్ఞప్తికి ఒబామా సానుకూలంగా స్పందించారు.వైట్ హౌస్ సైతం ఒబామాకేర్ అమలుపై గట్టి ఫోకస్ పెట్టింది.

రిజిస్ట్రేషన్లు, క్లెయిమ్‌లు భారీగా జరిగేలా చూస్తోంది.

ఫిబ్రవరిలో ప్రారంభమైన ప్రత్యేక నమోదు కాలంలో 1.2 మిలియన్ల మంది ప్రభుత్వ మార్కెట్ ద్వారా ఆరోగ్య బీమా కోసం సైన్ అప్ చేసారని వైట్ హౌస్ తెలిపింది.గత ఏడాది ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 30 వరకు చోటు చేసుకున్న జీవిత మార్పుల కారణంగా సుమారు 3,90,000 మంది సైన్ అప్ అయ్యారని ప్రభుత్వం తెలిపింది.

ఆఫీస్ కవరేజీని కోల్పోవడం, వివాహం చేసుకోవడం వంటి అంశాలను అర్హతగల జీవిత సంఘటనగా పరిగణిస్తారు.ఇది ఏడాదిలో ఎప్పుడైనా వ్యక్తులను సైన్ అప్ చేయడానికి అనుమతిస్తుంది.ఒబామా హయాంలో సృష్టించిన ఈ మార్కెట్లనే ఒబామాకేర్ అని పిలుస్తారు.ఈ మార్కెట్లు.

ఓ వ్యక్తి ఆరోగ్య చరిత్రతో సంబంధం లేకుండా, కరోనా సహా ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా పన్ను చెల్లింపుదారులకు రాయితీ కవరేజీని కల్పిస్తాయి.టెక్సాస్ సహా జీవోపీలోని ఇతర రాష్ట్రాలు ఆరోగ్య చట్టంపై సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోగ్య సంరక్షణ చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీం తీర్పు కోసం దేశంలోని హెల్త్ కేర్ వ్యవస్థ, రాజకీయ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Telugu Biden, Biofuels Texas, Healthcaregov, White-Telugu NRI

కాగా, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను ఉపసంహరించుకొని.వాటి స్థానంలో నూతన విధానాలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

వీటి ద్వారా మరింత మంది అమెరికన్లకు లబ్ధి చేకూర్చడం, అబార్షన్ కౌన్సెలింగ్‌పై ఉన్న ఆంక్షలను తొలగించడం సహా పలు అంశాలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు.ఈ చర్యల్లో భాగంగా.

HealthCare.gov బీమా మార్కెట్లను తిరిగి తెరుస్తామని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube