బిడెన్ ప్రకటనతో ఉలిక్కి పడ్డ ట్రంప్..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగుతోంది.అధికారం కోసం డెమోక్రటిక్ అభ్యర్ధి బిడెన్ ఒక వైపు, అధికారం చే జారిపోకుండా రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ మరొక వైపు హోరా హోరీగా పోటీ పడుతున్నారు.

 Trump And Biden Trying To Impress Indians,donald Trump, Joe Biden, China Issue,-TeluguStop.com

వాగ్దానాలు చేయడంలో కానీ, ప్రభుత్వాన్ని విమర్సలతో చీల్చి చెండాటంలో కానీ బిడెన్, కమలా హరీస్ లు దూసుకుపోతున్నారు.అలాగే పలు వర్గాల ఓట్లు ను తెలివిగా తనవైపుకి తిప్పుకోవడంలో అలాగే కీకలమైన సున్నితమైన విషయాలలో తెలివిగా వ్యవహరించడంలో బిడెన్ అద్భుతమైన చాణిక్యం ప్రదర్సిస్తున్నారనే చెప్పాలి.తాజాగా

బిడెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ట్రంప్ ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.చైనాతో వ్యతిరేకించే, నష్టపోతున్న దేశాలన్నిటికీ తాము అధికారంలోకి వచ్చాకా న్యాయం చేస్తామని, అండగా ఉంటామని బిడెన్ ప్రకటించారు.

ముఖ్యంగా భారత్ కి చైనా నుంచీ ఎక్కువగా తలనెప్పులు వస్తున్న క్రమంలో భారతీయ ఎన్నారై ఓటర్లని ఆకట్టుకునే క్రమంలో అలాగే భారత్ తో సంభంధాలు మరింత బలంగా కొనసాగించే క్రమంలోనే బిడెన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.ట్రంప్ కేవలం భారతీయ ఓట్లనే తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటే బిడెన్ ఏకంగా భారత్ మద్దతుకి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలాఉంటే

బిడెన్ చేసిన ప్రకటనతో బెంబేలెత్తిన ట్రంప్ భారత్ ,చైనా సరిహద్దు వివాదంపై మరోసారి ప్రకటన చేశారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ చైనా భారత్ పై చూపిస్తున్న దూకుడుకి అడ్డుకట్ట వేస్తామని, సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తామని ప్రకటించారు.

రెండు దేశాల సైనిక బలగాల మొహరింపుతో అక్కడ పరిస్థితి భయానకంగా మారిందని, రెండు దేశాలతో తాము మాట్లాడానని, తమకి తోచిన సాయం చేస్తుందని అన్నారు.కానీ బిడెన్ చైనా పై పోరు చేసే వారికి మద్దతుగా ఉంటామని ప్రకటిస్తే , నిన్నటి వరకూ చైనాపై కారాలు మిరియాలు నూరిన ట్రంప్ ఇప్పుడు చైనాని గౌరవిస్తున్నానని ప్రకటించడంపై రిపబ్లికన్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube