బైడెన్ కొలువులో మరో భారతీయుడు.. పెంటగాన్‌‌లో కీలక పదవి, ఎవరీ ఆశిష్ వజీరాని..?

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయులకు కీలక పదవులు దక్కుతున్న సంగతి తెలిసిందే.సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ భారతీయుల సత్తా, సమర్థతపై నమ్మకం వుంచి జో బైడెన్ .

 Joe Biden To Nominate Indian American Management Consultant To A Key Pentagon Position-TeluguStop.com

తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు.మేనేజ్‌మెంట్ రంగంలో అపార అనుభవం వున్న ఇండో అమెరికన్ ఆశిష్ వజీరానిని అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్‌‌లోని కీలక పదవికి నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ తెలిపారు.

ఈయనను డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ పర్సనల్ అండ్ రెడీనాస్‌గా నామినేట్ చేస్తానని అధ్యక్షుడు తెలిపారు.ఆశిష్ ప్రస్తుతం.ఏ20 స్ట్రాటజీ, ఎల్ఎల్‌సీ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఇక్కడ ఆయన వాణిజ్య, లాభాపేక్షలేని సంస్థలకు అభివృద్ధి వ్యూహాల అమలుపై సలహాలు అందిస్తున్నారు.

 Joe Biden To Nominate Indian American Management Consultant To A Key Pentagon Position-బైడెన్ కొలువులో మరో భారతీయుడు.. పెంటగాన్‌‌లో కీలక పదవి, ఎవరీ ఆశిష్ వజీరాని..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల వజీరాని నేషనల్ మిలిటరీ ఫ్యామిలీ అసోసియేషన్ (ఎన్ఎంఎఫ్ఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరించారు.ఈయన పదవీకాలంలో ఎన్ఎంఎఫ్ఏ ఫోర్ స్టార్ ఛారిటీ రేటింగ్‌ను తిరిగి పొందింది.

ఎన్ఎంఎఫ్ఏలో చేరడానికి ముందు ఆశిష్ సాయుధ సేవలు అందించే వైఎంసీఏలో ప్రోగ్రామింగ్‌కు నాయకత్వం వహించారు.

Telugu A20 Strategy, Ashish Wazirani, Joe Biden, Joe Biden To Nominate Indian-american Management Consultant To A Key Pentagon Position, Llc Principal, Military Family Association, Pentagon-Telugu NRI

వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం.సైనిక కుటుంబాల శ్రేయస్సుపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ కమిటీ సభ్యుడిగా కూడా వజీరాని ఎంపికయ్యారు.1986 నుంచి 1993 వరకు యూఎస్ నేవీలో సబ్‌మెరైన్ అధికారిగా ఆశిష్ విధులు నిర్వర్తించారు.వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్న వజీరాని.నార్త్‌ వెస్టర్న్ యూనివర్సిటీలోని మెక్‌కార్మిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మాస్టర్ ఆప్ ఇంజనీరింగ్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

#Pentagon #Joe Biden #Strategy #Ashish Wazirani #Military Family

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు