బిడెన్ టీమ్ లోకి మరో ఇద్దరు భారత మహిళలకు..!!

బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పరిపాలన విభాగంపై పూర్తిగా పట్టు సాధించేందుకు నిష్ణాతులైన వారిని తన టీమ్ గా ఏర్పాటు చేసుకున్నారు.అత్యంత కీలకమైన పదవులు అప్పజెబుతూ పాలనపై తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Biden Nominates Two Indian American Womento Key Admin Positions, Meera Joshi ,-TeluguStop.com

ఈ క్రమంలోనే దాదాపు 50 మందికి పైగా భారతీయులను తన టీమ్ లో క్రియాశీలక సభ్యులుగా తీసుకున్న బిడెన్ వారు ఊహించని పదవులు ఇస్తున్నారు.భారతీయుల సమర్ధత, కష్టపడి పనిచేసే తీరు నాకెంతో నచ్చుతాయని చెప్పే బిడెన్ పలు రంగాలలో నిపుణులైన వ్యక్తులను ఎంపిక చేసుకుంటున్నారు.

తాజాగా

అధ్యక్షుడు జో బిడెన్ మరో ఇద్దరు భారత సంతతి మహిళలకు తన టీమ్ లో స్థానం కల్పించారు.రాధికా ఫాక్స్ , మీరా జోషి అనే ఇద్దరు భారత సంతతి మహిళలకు బిడెన్ ఉన్నత స్థానాలను కల్పించారు.

రాధికా ఫాక్స్ ను జల, పర్యావరణ పరిరక్షణ సంస్థ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేశారు.అలాగే మీరా జోషి ను రవాణా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ మోటార్ కారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనాదికారిగా బిడెన్ నియమించారు.

ఈ మేరకు వీరి నియామకాలను ధృవీకరిస్తూ వైట్ హౌస్ నియామక ప్రకటన విడుదల చేసింది.

రాధికా ఫాక్స్ గతంలో అమెరికా వాటర్ అలియన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు.

అంతేకాదు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక యుటిలిటీస్ కమిషన్ లో కూడా కెలక బాధ్యతలు నిర్వహించారు. కొలంబియా యూనివర్సిటీ నుంచీ బిఏ అలాగే కాలిఫోర్నియాలో యూనివర్సిటీ నుంచీ రీజనల్ ప్లానింగ్ లో మాస్టర్స్ చేశారు.

ఇక మీరా జోషి ఫెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచీ జేడీ, బీఏ పొందారు.గతంలో న్యూయార్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ కరక్షన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు.

ఇద్దరికీ అపారమైన అనుభవం ఉన్న నేపధ్యంలో వారిని బిడెన్ తన టీమ్ లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.వీరి నియామకం పట్ల భారతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తూ బిడెన్ కు కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube