బిడెన్ టీమ్ లో స్థానం దక్కించుకున్న 20మంది భారతీయులు..ఎవరెవరంటే..!!

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న జో బిడెన్ తన పరిపాలన అమెరికా ఆర్ధిక స్థితిని మెరుగుపరిచేలా సమర్ధవంతమైన టీమ్ ను ఎంపిక చేసుకున్నారు.అమెరికా అధికారిక కార్యకలాపాలు తనదైన ముద్ర వేసేందుకు బిడెన్ నియమించుకున్న టీమ్ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని బిడెన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.100 మందితో బిడెన్ ఏర్పాటు చేసుకున్న ఈ టీమ్ లో దాదాపు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉండేలా ఏర్పాటు చేశారు బిడెన్ అంతేకాదు 100 లో సుమారు 20 మంది భారత ఎన్నారైలు ఉండటం ఇక్కడ మరొక విశేషం.

 List Of 20 Indian Americans Biden Administration , Joe Biden, Indian Americans,-TeluguStop.com

భారతీయుల ప్రతిభాపాటవాలపై ఎంతో నమ్మకం ఉండబట్టే మెజారిటీ సభ్యులుగా భారతీయులను చేర్చుకున్నారనేది అందరికి తెలిసిందే.

బిడెన్ ఏర్పాటు చేసుకున్న ఈ 20 మంది కూడా బిడెన్ కు ఎంతో సన్నిహితంగా ఎన్నో ఏళ్ళుగా బిడెన్ ను అనుసరిస్తున్న వాళ్ళు కావడం గమనార్హం.ఇదిలాఉంటే ఈ 20 మందిలో కూడా బిడెన్ దాదాపు 13 మంది మహిళలను ఎంపిక చేయడం మరో విశేషం.

ఇక ఈ టీమ్ లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.


Telugu Joe Biden, Kamala Harris, Listindian, Neha Gupta, Vivek Murthy-Telugu NRI

వినయ్ రెడ్డి : స్పీచ్ రైటింగ్ డైరెక్టర్

వివేక్ మూర్తి : యూఎస్ సర్జన్ జనరల్

ఉజ్రా జయ్ : విదేశాంగ శాఖకు అండర్ సెక్రెటరీ గా నియమితులు అయ్యారు.

వినీత గుప్తా : అసోసియేట్ అటార్నీ జనరల్ ఆఫ్ లా డిపార్ట్మెంట్

నీరా టాండన్ : వైట్ హౌస్ లో బడ్జెట్ , మేనేజ్మెంట్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్

మాలా : బిడెన్ సతీమణి జిల్ బిడెన్ కు పాలసీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తారు.

గరిమా వర్మ : జిల్ బిడెన్ కు డిజిటల్ డైరెక్టర్ గా నియమితులు అయ్యారు.

సబ్రినా సింగ్ : వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ

భరత్ రామూర్తి : అమెరికా జాతీయ ఆర్ధిక మండలి డిప్యూటీ డైరెక్టర్

అయేషా : వైట్ హౌస్ లోని డిజిటల్ డిపార్ట్మెంట్ లో పార్టనర్ షిప్ మేనేజర్

సమీరా ఫైజలీ : వైట్ హౌస్ లోని జాతీయా ఆర్ధిక మండలిలో డిప్యూటీ డైరెక్టర్

గౌతం రాఘవన్ : వైట్ హౌస్ లో బిడెన్ వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల డైరెక్టర్

వేదాంత్ పటేల్ : వైట్ హౌస్ లో అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీ

సుమోనా గుహ : దక్షిణాసియా వ్యవహారాల డైరెక్టర్

తరుణ్ చాబ్రా : జాతీయ భద్రతా సీనియర్ డైరెక్టర్

శాంతి కళాదిల్ : మానవహక్కుల వ్వ్యహారాల సమన్వయ కర్త

నేహా గుప్తా : వైట్ హౌస్ లో అసోసియేట్ కౌన్సిల్

రీమా షా : డిప్యూటీ అసోసియేట్ కౌన్సిల్

విదుర్ శర్మ : కరోనా టీమ్ అడ్వైజర్

సోనియా అగర్వాల్ : క్లైమేట్ పాలసీ సీనియర్ అడ్వైజర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube