బిడెన్ పరువు తీస్తున్న సుపుత్రుడు..అయ్యగారి విలాసాల లిస్టు పెద్దదే...!!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ కు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది.సెనేటర్ గా, ఉపాధ్యక్షుడిగా, డెమోక్రటిక్ పార్టీ అత్యంత సీనియర్ లీడర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బిడెన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి స్పూర్తివంతమైన లీడర్ గా నిలిచారు.

 Joe Biden Son Hunter Laptop Data Viral-TeluguStop.com

అయితే సుపుత్రా కొంప పీకరా అన్నట్టుగా బిడెన్ తనయుడు మాత్రం తండ్రి పరువుని హోల్ సెల్ గా మార్కెట్ లో అమ్మేస్తున్నాడు.తాను చేస్తున్న అత్యంత చెత్త పనులకు ఇప్పుడు బిడెన్ పరువు అడ్డంగా పోతోంది.

కొడుకుని గాడిలో పెట్టుకోలేని వ్యక్తి మన అగ్ర రాజ్యాన్ని మళ్ళీ అగ్ర స్థానంలో నిలుపుతాడా అంటూ రిపబ్లికన్ పార్టీ నేతలు ఇప్పటికే ట్రోల్స్ మొదలు పెట్టారు.ఇంతకీ అయ్యగారు చేసే చెత్త పనుల లిస్టు ఒక్క సారి పరిశీలిస్తే.

 Joe Biden Son Hunter Laptop Data Viral-బిడెన్ పరువు తీస్తున్న సుపుత్రుడు..అయ్యగారి విలాసాల లిస్టు పెద్దదే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధ్యక్షుడు బిడెన్ కుమారుడు పలు వివాదాలలో పూర్తిగా పీకల్లోతులో ఇరుక్కుపోయాడు.లక్షలాది డాలర్లు దుబారాగా ఖర్చు చేయడంలో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ దిట్టని తేలింది.

కాల్ గర్ల్స్, డ్రగ్స్, ఖరీదైన వాహనాల కొనుగోళ్ళు ఇలా ఒకటి కాదు రెండు కాదు కోట్లాది డాలర్లు మనోడు మంచి నీళ్ళలా ఖర్చు చేసేశాడట.హంటర్ ల్యాప్ టాప్ లోని డేటా ద్వారా కొన్ని విషయాలు డైలీ మెయిల్ ద్వారా వెల్లడి అవడంతో హవ్వా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అందరూ.

ఇంతకీ అందులో ఏమున్నాయి.

హంటర్ బిడెన్ డబ్బును దుబారాగా ఖర్చు చేయడంలో దిట్టట.2013- 16 మధ్యలో అతడి సంపాదన రూ.42 కోట్లు రాగా విచ్చలవిడిగా చేసిన ఖర్చులకు అప్పుల ఊబిలో కూరుకుపోయాడట.రేంజ్ రోవర్, ఆడి, కోట్లాది డాలర్లు విలువ చేసే పడవలు, కొనుగోలు చేయడం హంటర్ కి అలవాటు అంతేకాదు కాల్ గర్ల్స్ కోసం అతడు మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడట.అతడి ల్యాప్ టాప్ నుంచీ ఫోరెన్సిక్ అధికారులు ఎన్నో పోర్న్ వీడియోస్ స్వాధీనం చేసుకున్నారట.

వాటిలో హంటర్ ఒక మహిళను వేధిస్తున్న వీడియోలో కూడా ఉన్నాయట.ఓ ప్రఖ్యాత పోర్న్ వెబ్ సైట్ లో అతడు ఖాతా దారుడిగా కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ తతంగం మొత్తం బయట పడటంతో అధ్యక్షుడు బిడెన్ తల దించుకునే పరిస్థితి వచ్చిందని అమెరికన్స్ హంటర్ ను తిట్టిపోస్తున్నారు.

#JoeBiden's #Joe Biden Son #Hunter Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు