బిడెన్ సంచలన వ్యాఖ్యలు...ట్రంప్ బెట్టు చేస్తే సైన్యం గెంటేస్తుంది..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా కేవలం 64 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.రోజుడు గడిస్తున్న కొద్దీ అధ్యక్ష అభ్యర్ధులు బిడెన్, ట్రంప్ తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు.

 Joe Biden Sensational Comments On Donald Trump, White Hose, Black Man Protest, P-TeluguStop.com

వాడి వేడిగా ప్రసంగాలు చేస్తూ మాటల యుద్ధం చేస్తున్నారు.అయితే ట్రంప్ ప్రచారంలో కంటే కూడా బిడెన్ ప్రసంగా ప్రచారంలో పదును ఎక్కువనే చెప్పాలి.

ట్రంప్ పై ఏకదాటిగా విమర్శలు చేయడంలో, అధ్యక్షుడిగా ట్రంప్ వైఫల్యాలని ఎండగట్టడంలో బిడెన్ ఓ మెట్టు పైనే ఉన్నారు.తాజాగా బిడెన్ ట్రంప్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

నల్లజాతీయులపై జాత్యహంకార దాడులు వెనుక ట్రంప్ ఉన్నాడెమో ఒక వేళ ఉండిఉండకపోతే బాధితులకి న్యాయం జరిగి ఉండేది అంటూ వ్యాఖ్యానించారు.నల్లజాతీయులు చేపట్టిన నిరసనలను అణచివేయడానికి, అలాగే తన వ్యక్తి గత కక్షలను తీర్చుకోవడానికి ట్రంప్ అమెరికా అత్యుత్తమ ఆర్మీని వాడుకున్నారని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే ట్రంప్ అమెరికా పౌరుల హక్కులని కాలరాస్తున్నారని అన్నారు.నేను అమెరికా అధ్యక్షుడిగా మీ ఆమోదం పొందిన తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ దేశ ఆర్మీని సొంత ప్రయోజనాల కోసం ట్రంప్ లా వాడుకోనని అన్నారు.

Telugu Black, Joebiden, White Hose-

ట్రంప్ ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక శ్వేత సౌధం నుంచీ వెళ్లనని బెట్టు చేస్తే అదే ఆర్మీ ఆయన్ని బయటకు గెంటేస్తుందని చెప్పారు.సైన్యానికి ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమని, ఎలాంటి వారైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోదని అన్నారు.ట్రంప్ ఓడిపోవడం ఖాయమని ఈ విషయం ట్రంప్ కూడా గ్రహించారని, త్వరలో సైన్యం ద్వారా బయటకి వెళ్ళడానికి సిద్దంగా ట్రంప్ ఉండాలని వ్యాఖ్యానించారు బిడెన్.అయితే బిడెన్ చేసిన వ్యాఖ్యలని ట్రంప్ మద్దతు దారులు ఖండిస్తున్నారు, దేశ సైన్యాన్ని ట్రంప్ స్వార్ధ ప్రయోజనాలకి ఎలా వాడుకున్నారో కూడా బిడెన్ చెప్పాలని, ఇలాంటి ఆరోపణలు చేయడం బిడెన్ కి అలావాటేనని ఎదురు దాడికి దిగారు, అంతేకాదు బిడెన్ గెలిస్తే చైనా చేతుల్లోకి అమెరికా వెళ్ళడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube