వాషింగ్టన్ కోర్టు న్యాయమూర్తిగా తెలుగు తేజం.. బైడెన్ ఆదేశాలు

భారతీయుల సత్తాపై తొలి నుంచి మంచి గురి వున్న జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇండో అమెరికన్ ప్రముఖులకు కీలక పదవులు ఇస్తూ వస్తున్నారు.ఈ లిస్ట్ ఇప్పటికే 50 మందిని దాటిపోయింది.

 Joe Biden Nominates Indian-american Rupa Ranga Puttagunta As Judge Of Dc Distric-TeluguStop.com

అయినప్పటికీ ఆయన మాత్రం కీలక విభాగాలకు చీఫ్‌లుగా భారతీయులనే నియమిస్తున్నారు.తాజాగా, మరో భారత సంతతి మహిళకు బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు.

వాషింగ్టన్‌ డీసీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా వనితా పుట్టగుంట రూపా రంగాను అధ్యక్షుడు నామినేట్ చేశారు.రూపా రంగ తెలుగు మూలాలున్న వారు కావడం విశేషం.

ఆమె తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలువపాముల.

రూపా తల్లిదండ్రులు పుట్టగుంట పున్నమ్మ, రంగా ఇద్దరూ అమెరికాలో ప్రముఖ డాక్టర్లే.15 ఏళ్ల కిందట రూపా తల్లి పున్నమ్మ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.లయన్స్‌ జిల్లా గవర్నర్‌ పుట్టగుంట సతీష్‌ కుమార్‌, కాకులపాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు చలసాని పూర్ణ బ్రహ్మయ్య.

పుట్టగుంట పున్నమ్మకు సమీప బంధువులు.వాషింగ్టన్‌ డీసీ జిల్లా కోర్టు జడ్జిగా రూప నియమితులు కావడంతో ఆమె బంధువులు, అమెరికాలోని భారతీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రూపా రంగాతో పాటు మరో 10 మందిని బైడెన్ దేశంలోని వివిధ కోర్టులకు న్యాయమూర్తులుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.వీరిలో ఆఫ్రికన్ అమెరికన్, ముస్లింలకు కూడా అవకాశం లభించడం విశేషం.

బైడెన్ నామినేట్ చేసినవారిలో ఫెడరల్ సర్క్యూట్, డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తులు ఉన్నారు.రూపా రంగా నియమాకాన్ని సెనేట్ ధ్రువీకరిస్తే వాష్టింగ్టన్ డీసీ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తిగా నియమితులైన తొలి ఆసియా అమెరికన్‌గా ఘనత వహించనున్నారు.

ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు రూపా పుట్టగుంట.మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి 2007లో డాక్టర్ డిగ్రీ పొందిన పుట్టగుంట.

తర్వాత డీసీ కోర్టు న్యాయమూర్తి విలియమ్ ఎం జాక్సన్ వద్ద 2008 నుంచి 2010 వరకు, అనంతరం సీనియర్ న్యాయమూర్తుల వద్ద 2011 వరకు లా క్లర్క్‌గా పనిచేశారు.ఈ సమయంలో విశేష అనుభవం గడించారు.

న్యాయవాదిగా 2013లో కెరీర్ ప్రారంభించిన రూపా.క్రిమినల్ కేసులను వాదించడంలో దిట్టగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మహిళలపై గృహహింసకు సంబంధించిన కేసులలో వాషింగ్టన్ డీసీ కోర్టులో న్యాయవాదిగా సేవలు అందజేశారు.స్వయం సహాయ కేంద్రం, అటార్నీ నెగోషియేటర్ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని గృహ హింస బాధితుల తరఫున ప్రాతినిధ్యం వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube