అమెరికా: జో బైడెన్ జట్టులోకి మరో భారతీయుడు.. పెంటగాన్‌లో కీలక పదవి

Joe Biden Nominates Indian American Ravi Chaudhary To Key Pentagon Post

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ తన టీంలో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ వెళుతున్నారు.భారతీయుల సామర్ధ్యంపై నమ్మకం వుంచిన అమెరికా అధ్యక్షుడు ముఖ్యమైన విభాగాలకు అధిపతులుగా మనవారినే నియమిస్తున్నారు.

 Joe Biden Nominates Indian American Ravi Chaudhary To Key Pentagon Post-TeluguStop.com

తాజాగా ఇండియన్-అమెరికన్ రవి చౌదరిని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌లో కీలక పదవికి నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ ప్రకటించారు.
రవి చౌదరి గతంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌గా పనిచేశారు.

తాజాగా ఆయనను ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ ఇన్‌స్టాలేషన్స్‌గా బైడెన్ నామినేట్ చేశారు.ఈ కీలకమైన పెంటగాన్ పదవిలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు యూఎస్ సెనేట్ రవి నామినేషన్‌ను ధ్రువీకరించాల్సి వుంది.

 Joe Biden Nominates Indian American Ravi Chaudhary To Key Pentagon Post-అమెరికా: జో బైడెన్ జట్టులోకి మరో భారతీయుడు.. పెంటగాన్‌లో కీలక పదవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవి చౌదరి గతంలో అమెరికా రవాణా శాఖలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.అంతేకాకుండా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)లోని కమర్షియల్ స్పేస్ ఆఫీస్‌లో డైరెక్టర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ అండ్ ఇన్నోవేషన్‌గానూ విధులు నిర్వర్తించారు.

ఈ హోదాలో ఎఫ్ఏఏ కమర్షియల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ మిషన్‌కు మద్ధతుగా అధునాతన అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు.రవాణా శాఖలో విధులు నిర్వర్తించే సమయంలో దేశవ్యాప్తంగా వున్న తొమ్మిది ప్రాంతాలలో విమానయాన కార్యకలాపాల ఏకీకరణ కోసం రీజియన్స్ అండ్ సెంటర్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో 1993 నుంచి 2015 వరకు యాక్టివ్ డ్యూటీలో వున్న రవి చౌదరి.వైమానిక దళంలో వివిధ ఆపరేషన్స్, ఇంజనీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్‌మెంట్లను పూర్తి చేసినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.సీ 17 విమాన పైలట్‌గా ఆఫ్గనిస్తాన్, ఇరాక్‌లలో అనేక మిషన్‌లు, పర్సనల్ రికవరీ సెంటర్, మల్టీ నేషనల్ కార్ప్స్, ఇరాక్‌లోని గ్రౌండ్ డిప్లాయ్‌మెంట్‌తో సహా గ్లోబల్ ఫ్లైట్ ఆపరేషన్స్ నిర్వహించారు.

సిస్టమ్స్ ఇంజనీర్‌గా ఆయన నాసా వ్యోమగాముల భద్రత కోసం నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రక్షణ కార్యకలాపాలకు సపోర్ట్‌గా నిలిచారు.

బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వున్న కాలంలో ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులకు సంబంధించి అధ్యక్షుడి సలహా సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు.రవి చౌదరి ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, టెస్టింగ్, సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లలో డిఫెన్స్ అక్విజిషన్ సర్టిఫికేషన్‌లను పొందారు.

.

#Defense #NASA #Joe Biden #Ravi Chaudhary #IndianAmerican

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube