నోబెల్ కి నామినేట్ అయిన బిడెన్..!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆద్యంతం ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ ఎన్నికల్లో బిడెన్ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, ట్రంప్ మరో సారి అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

 Joe Biden Nominated For Nobel Peace Prize,joe Biden ,  Nobel Peace Prize,biden S-TeluguStop.com

ఇదిలాఉంటే ఎవరికి వారు తాము ఉత్తమ వ్యక్తులుగా చాటి చెప్పుకోవడానికి నేను ఇది చేస్తా అది చేస్తా అంటూ వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు.ఒకడుగు ముందుకు వేసిన బిడెన్ మద్దతు దారులు బిడెన్ ని శాంతి స్వరూపుడిగా అభివర్ణిస్తూ ఏకంగా నోబెల్ కి నామినేట్ చేసేశారు.

నోబెల్ బహుమతికి బిడెన్ అర్హుడు అంటూ బిడెన్ మద్దతు దారుడు బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు క్రిస్ బ్రియాంట్ బిడెన్ పేరును నామినేట్ చేశారు.హింసాత్మక సంఘటనలు జరిగే సమయంలో చర్చలు ద్వారా శాంతి యుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని బిడెన్ తెలిపారని, ఆ విధంగా బిడెన్ కొన్ని విషయాలలో ముందడుగు వేశారని అంటున్నారు.

అందుకే తానూ బిడెన్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్టుగా తెలిపారు.అయితే బిడెన్ ని నోబెల్ కి నామినేట్ చేయడంపై రిపబ్లికన్ పార్టీలు విమర్సలు చేస్తున్నాయి.

ఏ విధంగా బిడెన్ నోబెల్ కి అర్హుడో చెప్పాలని అంటున్నాయి.ఎన్నికల సమయంలో తానొక మానవతా వాదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ బిడెన్ అందుకు ఏ మాత్రం అర్హుడు కాదని విమర్శలు చేస్తున్నాయి.

ఇదిలాఉంటే.ఇప్పటి వరకూ బిడెన్ చైనా భారత సరిహద్దులలో జరిగిన ఘర్షణల పై నోరు మెదపలేదు, అంతేకాదు పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను ఇప్పటి వరకూ ప్రస్నించలేదు అలాంటి వ్యక్తికీ నోబెల్ కి ఎలా నామినేట్ చేస్తారంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube