అఫ్ఘాన్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన జో బైడెన్.. !

ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్కువగా సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక అమెరికా ఆర్ధిక విషయాల్లో, ఇతర దేశాల విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా తెలియచేస్తున్నారు.

 Joe Biden Makes Key Remarks On Afghan Future  America, President, Joe Biden, Key-TeluguStop.com

ఈ క్రమంలోనే అఫ్ఘాన్ నుంచి యూఎస్ బలగాల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన సందర్భంగా వైట్ హౌస్ నుంచి టెలివిజన్ సందేశమిచ్చిన బైడెన్, అఫ్ఘనిస్తాన్ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.అఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఇక పొరుగుదేశాల సహకారం మీదే ఆధారపడి ఉందని అన్నారు.

Telugu Afghanistan, America, Joe Biden, Key-Latest News - Telugu

అయితే అఫ్ఘనిస్థాన్ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, రష్యా, భారత్, టర్కీల సహకారం ఆ దేశానికి ఉండాలని ఆకాంక్షించారు బైడెన్.ఇకపోతే అఫ్ఘాన్ లో దశాబ్దాలుగా జరుగుతున్న అంతర్గత యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి అక్కడి నుంచి తమ దేశానికి చెందిన బలగాలను వెనక్కి రప్పిస్తామని పేర్కొన్నారు.ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం వల్ల అఫ్ఘాన్ లో శాంతి స్థాపన జరిగితే అంతకంటే కావలసింది ఏముందని అనుకుంటున్నారట నెటిజన్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube