ఏంటి బిడెన్...అమెరికా ప్రజలపై ఇంత ప్రేమ...??

ఎన్నికల దగ్గరపడుతున్నయాంటే రాజకీయ నేతలకి ఎక్కడలేని వల్లమాలిన అభిమానం ప్రేమ ఆవరిస్తాయి.కుటుంభ సభ్యులకంటే కూడా ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఇచ్చే కటింగ్ లు ఓ రేంజ్ లో కళ్ళకి కట్టినట్టుగా కన్పిస్తూ ఉంటాయి.

 Joe Biden Shows Love Towards American People, America Presidental Elections, Don-TeluguStop.com

ఓట్లు అడిగే విధానం, ఆ సమయంలో వారు చూపించే ప్రేమ మా పై మా నేతలకి ఇంత ప్రేమ ఉందా అనిపించేలా చేస్తాయి.ఇవన్నీ అక్షర సత్యాలే, అవునో కాదో అందరికి తెలిసినవే.

ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం అమెరికా ప్రజలు ఎదుర్కుంటున్నారు.నవంబర్ 3 వ తేదీన జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అమెరికా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.

అమెరికాలో కరోనా కేసులు 50 లక్షలకి పైగా నమోదు కావడంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న జో బిడెన్ ప్రజలని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు.అమెరికా ప్రజలపై కరోనా విరుచుకుపడుతోంది ఈ సమయంలో అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి, ఎంతో మంది కరోనా సోకి మరణించారు, వారి కుటుంభాల పరిస్థితి దారుణంగా తయారయ్యి ఉంటుంది ఈ పరిస్థులని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అంటూ బిడెన్ తెలిపారు.

గడించిన కొన్ని నెలలుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితులు చూసుంటే తట్టుకోలేక పోతున్నాను అంటూ బిడెన్ అమెరికా ప్రజలపై ప్రేమతో కూడిన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే

Telugu America, Corona, Donald Trump, Financial, Joebiden-

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వైఫల్యం చెందారని, అగ్ర రాజ్యమైన అమెరికా ఆర్ధిక పరిస్థితి మరీ దిగజారిపోవడానికి ట్రంప్ అసమర్ధతే కారణమని అన్నారు.కరోనాని నివారించి అమెరికన్స్ ని కాపాడటంలో ట్రంప్ విఫలమయ్యారని విమర్శలు చేశారు.ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

అమెరికా ప్రజలని ఇలా చూడటం తట్టుకోలేక పోతున్నాను అంటూనే అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోండి అనే సందేశాన్ని అందించారు.అయితే బిడెన్ తీరుపై కొందరు సోషల్ మీడియాలో మండిపడ్డారు.

గడించిన కొన్ని నెలలుగా అమెరికా ప్రజలపై ప్రేమ చూపని బిడెన్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అమెరికా ప్రజలపై బిడెన్ కి ఇంత ప్రేమ ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube