బైడెన్- హారిస్ ప్రమాణం : ఘుమఘుమలాడే వంటలు.. మెనూ ఇదే..!

అమెరికా రాజకీయ చరిత్రలో ఇవాళ్టీ నుంచి కొత్త అధ్యాయం మొదలుకానుంది.దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 Inauguration Day Dinner Features Harris Favorite Dish, Joe Biden, Kamala Harris-TeluguStop.com

మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి కొత్త అధినేత వస్తుంటే ఆయన హోదా.అమెరికా స్థాయికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు.

ఇక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మర్యాద పూర్వకంగా ఇచ్చే డిన్నర్‌ గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న అతిరథ మహారథులు నోరూరించే వంటకాలను ఆరగించనున్నారు.

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ ఆధ్వర్యంలో మెనూని సిద్ధం చేశారు.ఈ విందులో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఇష్టమైన వంటకం సీఫుడ్‌ ‘గంబో’ను కూడా చేర్చారు.

‘గంబో’ అనేది ఒక సూపు.దీనిని షెల్‌ ఫిష్‌ లేదా మాంసం, కాప్సికం, ఉల్లిపాయతో తయారు చేస్తారు.

‘గంబో’ లూసియానా రాష్ట్ర అధికారిక వంటకం.చెఫ్ రాబర్ట్ డోర్సీ చిన్నతనంలో కమలా హారిస్‌తో కలిసి చదువుకున్న వ్యక్తి కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.

మెనూలో ఏమున్నాయంటే.!!

Telugu America Day, Dayharris, January, Joe Biden, Kamala Harris, Kamalaharris-M

పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్, వైట్‌ రైస్‌, లూసియానా లవ్‌, డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్, బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌, బౌర్‌బోన్‌ కారమెల్ స్వీట్స్

కరోనా వ్యాప్తి , ఇటీవల క్యాపిటల్ బిల్డింగ్లో జరిగిన హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో చాలా తక్కువ మందిని ప్రమాణ స్వీకారానికి అనుమతించనున్నారు.కాంగ్రెస్ సభ్యులు, ఇతర అతిథులతో కలిపి 1,000 మంది మాత్రమే హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube