విజయం తర్వాత బైడెన్, కమలా హారీస్ పలుకులు

అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ (77)నే చివరికి విజయం వరించింది.ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టనున్నారు.

 Joe Biden And Kamala Harris Make Victory Speeches, Joe Biden, Kamala Harris, Ame-TeluguStop.com

ఇక యూఎస్ చరిత్రలోనే ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, భారత సంతతికి చెందిన కమలా హారీస్‌ రికార్డు సృష్టించనున్నారు.శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియాలో జో బైడెన్‌ విజయం సాధించారు.

ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కాయి.ఎలక్టోరల్‌ కాలేజీలోని 538 ఓట్లకుగాను మ్యాజిక్‌ ఫిగర్‌ 270 కాగా, 284 ఓట్లు బైడెన్‌ ఖాతాలో పడ్డాయి.జార్జియా(16,) నార్త్‌ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్‌ డెలావెర్‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవసభలో ఉద్వేగంగా ప్రసంగించారు.

అమెరికా ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారని.వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బైడెన్‌ కృతజ్ఞతలు తెలిపారు.దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని రిపబ్లికన్లతో కలిసి సాగుతామని బైడెన్ స్పష్టం చేశారు.

పరస్పర సహకారంతోనే ముందుకు నడవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని.అంతా కలిసి సాగితే అమెరికన్లు ఏదైనా సాధించలగలరని ఆయన వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య ఎలాంటి తేడా చూపబోనని హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేమని అంతేకాకుండా పుట్టినరోజులు, వివాహాలు వంటి వాటికి హాజరవ్వలేమని ఆయన బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ మాట్లాడుతూ.తన విజయం మహిళా లోకం సాధించిన గెలుపుగా ఆమె అభివర్ణించారు.తాను అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళను కావొచ్చు.కానీ చివరి మహిళను మాత్రం కానని కమలా హారిస్ ఉద్వేగంగా ప్రసంగించారు.గత నాలుగేళ్లుగా సమానత్వం, న్యాయం కోసం పోరాడామని.కానీ ఇప్పుడే అసలైన పని మొదలైందని ఆమె అన్నారు.

తొలుత కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని.ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించాలని, వాతావరణ మార్పులను నియంత్రించాలని, జాతి వివక్షను పెకిలించాలని కమలా హారిస్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube