ఆయన పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్: జో బిడెన్ ఆరోగ్యానికి ఢోకా లేదన్న వైద్యులు

మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆయన వైద్యులు కొట్టిపారేశారు.జో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేంత ఆరోగ్యంగా ఉన్నారని డెమొక్రాట్ పార్టీ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.77 ఏళ్ల బిడెన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నామినేషన్ కోరుతున్న 15 మంది డెమొక్రాట్లలో ఒకరు.ఈ రేసులో వున్న వారిలో మొదటి ముగ్గురు సెప్టుజేనరియన్లే.

 Joe Biden Is Healthy And Fit Us President-TeluguStop.com

బిడెన్ 1988లో మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడ్డారు.అయితే ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని, గుండె సక్రమంగానే కొట్టుకుంటోందని డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు.జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ మెడికల్ ఫ్యాకల్టీ అసోసియేట్స్‌లో కెవిన్ ఒకరు.బిడెన్ తన గుండెకు ప్రతిస్కందక మందులు, అధిక కొలెస్ట్రాల్‌ నివారణకు క్రెస్టర్ తీసుకుంటున్నట్లు కానర్ వెల్లడించారు.

Telugu Joe Biden, Joebiden, Telugu Nri-

ఆయనకు యువకుడిగా ఉన్న సమయంలో వచ్చిన లోకలైజ్డ్ నాన్ మెలనోమా చర్మ క్యాన్సర్ తప్పించి ఎటువంటి క్యాన్సర్ లేదు.దీనితో పాటు డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు, న్యూరోలాజికల్ డిజార్డర్ తదితర వ్యాధులు లేవని వైద్యుల నివేదిక తెలిపింది.77 ఏళ్ల బిడెన్ పూర్తి ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నారని, అమెరికా అధ్యక్ష పదవితో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్, స్టేడ్ హెడ్, కమాండ్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి సమర్థుడని కానర్ తన నివేదికలో తెలిపారు.ఓ కానర్ 2009 నుంచి జో బిడెన్‌కు వ్యక్తిగత వైద్యునిగా సేవలందిస్తున్నారు.

కాగా డెమొక్రాట్ నామినేషన్స్ కోసం పోటీ పడుతున్న జో బిడెన్ సన్నిహితుడు బెర్నీ సాండర్స్ గుండెపోటుతో బాధపడుతున్నప్పటికీ, కోలుకుని తిరిగి తన ప్రచారం ప్రారంభించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube