బైడెన్- హారిస్ ప్రమాణ స్వీకారం: భారీ భద్రత.. ఓ ఫోన్ కాల్ ఉలిక్కిపడ్డ యంత్రాంగం

క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో ఎంతో అట్టహాసంగా జరగాల్సిన అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం తుపాకీ నీడలో సాదాసీదాగా జరిగింది.దీంతో ప్రతిసారి లక్షలాది మంది వచ్చే ఈ వేడుక ఈసారి చాలా తక్కువ మంది సమక్షంలో జరిగింది.

 Biden Inauguration Us Supreme Court Is Being Evacuated Reportedly Due To A Bomb-TeluguStop.com

ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్ధితి విధించారు.వీధి వీధినా నేషనల్ గార్డ్ బలగాలను మోహరించారు.

ఒక్క వాషింగ్టన్ సిటీలోకే ఏకంగా 25 వేల మంది నేషనల్ గార్డ్ బలగాలను దించింది.ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే రంగంలోకి దిగేలా ప్రతి చోటా నేషనల్ గార్డులను మోహరించింది.

ఆందోళనకారులు గన్స్ తో కాల్పులకు దిగొచ్చని, సెక్యూరిటీ సిబ్బందిలోనే కొందరు కాల్పులకు తెగబడొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.దీంతో సొంత సెక్యూరిటీ సిబ్బందిపైనే ఎఫ్బీఐ అధికారులు నిఘా పెట్టారు.

నేషనల్ గార్డు కమెండోలను కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ వాషింగ్టన్ లో మోహరించారు.ఇలా చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమయ్యేలా భద్రత ఉన్నవేళ అమెరికా సుప్రీంకోర్టుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి సుప్రీంకోర్టులో బాంబు ఉందంటూ ఫోన్ చేసి చెప్పాడు.కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం మరికొద్దిసేపట్లో జరగనున్న వేళ ఈ బెదిరింపు రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు.బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.

Telugu Bidensupreme, Bomb Threat, Capitol Bhavan, Fbi Officials, Joe Biden, Kama

ఈ క్రమంలో పటిష్ట పహారా మధ్య బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు.తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్లనాటి బైబిల్‌పై ప్రమాణం చేసి బైడెన్‌ దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత జో బైడెన్ తొలి రోజే కీలకమైన 15 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు.మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పలు ఆదేశాలను ఆయన వెనక్కి తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube