ట్రంప్ సంచలన వ్యాఖ్యలు...ఈ సారి అధ్యక్ష పీఠం బిడెన్ దే..!!!

అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి తప్పదని ట్రంప్ ఫిక్స్ అయ్యిపోయారా.?? జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ కి ముందే తెలిసి పోయిందా అనే అవుననే చెప్పాలి.ఎందుకంటే ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.నిన్నటి రోజున మీడియాతో మాట్లాడిన ట్రంప్ తనని అమెరికా మెజారిటీ ప్రజలు అధ్యక్షుడిగా ఉండటానికి ఒప్పుకోవడం లేదని.

 Donald Trump,america President, Joe Biden, Democratic Party-TeluguStop.com

బిడెన్ అధ్యక్షుడు అవుతాడని బాహాటంగానే ట్రంప్ చెప్పేయడం అందరిని షాక్ కి గురి చేసింది.

డెమోక్రటిక్ పార్టీ తరుపున బిడెన్ అధ్యక్ష బరిలో నిలువగా…రిపబ్లికన్ పార్టీ నుంచీ మళ్ళీ ట్రంప్ అధ్యక్షుడిగా బరిలో నిలిచారు.

అయితే నవంబర్ లో ఎన్నికల నేపధ్యంలో ట్రంప్ పాలనపై సర్వేలు చేపట్టిన కొన్ని సంస్థలు ట్రంప్ పై ప్రజలు ఏ స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారో లెక్కలు గట్టి మరీ చెప్పేశాయి. అమెరికాలో సర్వేలు చేపట్టిన సంస్థలు అన్నీ ట్రంప్ కి కేవలం 40 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారని బిడెన్ కి మిగిలిన వారందరూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు మద్దతుఇస్తున్నారని తెలిపాయి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నవంబర్ ఎన్నికల్లో బిడెన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేశారు.అయితే సరిగా మాట్లాడటం కూడా చేతకాని వ్యక్తిని అధ్యక్షుడిగా మీరు అంగీకరిస్తారా లేదా అనేది మీరే తేల్చుకోవాలని ప్రజలని ఉద్దేశించి అన్నారు.అమెరికా కోసం నేను ఎంతో చేశాను కానీ నన్ను కొందరు ప్రజలు ఇష్టపడటం లేదని అన్నారు.

ఇదిలాఉంటే కరోనా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి, తాజాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యా ఉదంతం.ఈ ఘటనలపై ట్రంప్ స్పందించిన తీరు అన్నీ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎసరు తెచ్చాయని అంటున్నారు నిపుణులు.

ఏది ఏమైనా ట్రంప్ బహిరంగంగా బిడెన్ గెలుపుపై ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube