జో బైడెన్‌కు అస్వస్థత...కోలుకోవాలంటూ ట్రంప్ ట్వీట్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.శనివారం పెంపుడు కుక్కతో ఆడుతున్న సమయంలో బైడెన్ కిందపడ్డారు.దీంతో ఆయన నడవలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో వైద్యుడిని సంప్రదించామని.

 Joe Biden Fractures Foot While Playing With Dog, To Wear A Boot, Joe Biden Suffe-TeluguStop.com

పరీక్షల్లో ఆయన కుడిపాదం ఫ్రాక్చర్ అయ్యిందని బైడెన్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఈ కారణం చేత బైడెన్ కొన్ని వారాల పాటు వాకింగ్ షూ ధరించాల్సి వుంటుందని వ్యక్తిగత వైద్యుడు పేర్కొన్నారు.

మరోవైపు బైడెన్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

కాగా ఇప్పటికే వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలరన్న అంశంపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆది నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు సుముఖంగా లేని ఆయన, బైడెన్‌ అధికారం చేపట్టినా ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేరని, కొద్దిరోజుల్లోనే కమలా హారిస్ ఆయన నుంచి పదవిని లాక్కుంటారని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా 1988లో బైడెన్‌ రెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

బ్రెయిన్‌కు సంబంధించి ఆయనకు మేజర్‌ ఆపరేషన్‌ జరిగింది.అంతేగాక 2003లో బైడెన్‌ గ్లాల్‌బ్లాడర్‌ను తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Biden Leg, Biden, Donald Trump, Joebiden, Kamala Harris-Telugu NRI

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 8,00,11,000 ఓట్లు వచ్చాయి.2016 ఎన్నికల వరకు చూస్తే.అమెరికా చరిత్రలో ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థికి 7 కోట్ల ఓట్లు కూడా పోలవలేదు.

అయితే జో బైడెన్ మాత్రం ఏకంగా 8 కోట్ల ఓట్లను దాటేసి సరికొత్త చరిత్రను సృష్టించారు.ట్రంప్‌కు 7.38 కోట్ల ఓట్లు పోలయ్యాయి.జో బైడెన్ తరువాతి స్థానంలో అత్యధిక ఓట్లు పొందిన నాయకుడిగా ట్రంప్ నిలిచారు.

కాగా, జో బైడెన్‌ మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందగా.ట్రంప్ కేవలం 232 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే సాధించారు.మ్యాజిక్ ఫిగర్(270)ను జో బైడెన్ దాటేయడంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా 2021 జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube