అమెరికా: ట్రక్కులో వలసదారుల మరణాలపై జో బైడెన్ దిగ్భ్రాంతి

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం శాన్‌ ఆంటోనియాలోని ఒక రోడ్డుపై నిలిపివున్న ఓ కంటైనర్‌ ట్రక్కులో 46 మంది వలసదారుల మృతదేహాలు బయటపడిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రయత్నంలో వీరు ప్రాణాలను పొగొట్టుకున్నారు.

 Joe Biden Expressed Grief Over The Death Of Dozens Of Undocumented Migrants In Texas Joe Biden , Migrants, Texas, Died , San Antonia, William Mcmanus-TeluguStop.com

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన.ఈ ఘటన భయానకమైనదిగా అభివర్ణించారు.దీని వెనుక పూర్వాపరాలపై అధికారులు ఆరా తీస్తున్నారని బైడెన్ తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన వారు, ప్రాణాలతో పోరాడుతున్న వారి కోసం ప్రార్ధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన ఫెడరల్, స్టేట్, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలకు బైడెన్ ధన్యవాదాలు తెలిపారు.

 Joe Biden Expressed Grief Over The Death Of Dozens Of Undocumented Migrants In Texas Joe Biden , Migrants, Texas, Died , San Antonia, William Mcmanus-అమెరికా: ట్రక్కులో వలసదారుల మరణాలపై జో బైడెన్ దిగ్భ్రాంతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని .ప్రాథమిక అంచనా ప్రకారం స్మగ్లర్లు, మానవ అక్రమ రవాణాదారుల నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇకపోతే.సోమవారం కంటైనర్ లో అచేతనంగా పడివున్న 46 మందిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.అప్పటికే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు.వీరంతా నమోదుకానీ వలసదారులేనని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

సజీవంగా కనుగొనబడిన వారి శరీరాలు వేడిగా వున్నాయి.వడదెబ్బ, అలసటతో వీరంతా అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.

కంటైనర్ లోని రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్ యూనిట్ కూడా పనిచేయడం లేదని శాన్ ఆంటోనియో ఫైర్ చీఫ్ చార్లెస్ హుడ్ మీడియాకు తెలిపారు.సమాచారం అందుకున్న 60 ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు పోలీసుల కస్టడీలో వున్నారు.అయితే వారికి ఈ విషాదంతో సంబంధం వుందా లేదా అన్న దానిపై వివరాలు తెలియాల్సి వుందని శాన్ ఆంటోనియో పోలీస్ చీఫ్ విలియం మెక్ మానస్ మీడియాతో చెప్పారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube