అమెరికా ఎన్నికల చరిత్రలో బిడెన్ బిగ్గెస్ట్ రికార్డ్..!!

అమెరికాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల హడావిడే జరుగుతోంది.కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఎన్నికలకు మిగిలిఉండటంతో అందరూ ఎంతో ఆసక్తిగా పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.

 Joe Biden Creates Record By Spending  $582 Million On Elections, Election Campai-TeluguStop.com

పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.బిడెన్, ట్రంప్ ఇరు అధ్యక్ష అభ్యర్ధులు ప్రచారాలలో స్పీడు పెంచారు.

ఇదిలాఉంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ అమెరికా ఎన్నికల చరిత్రలో బిగ్గెస్ట్ రికార్డ్ సృష్టించారు.గత ఎన్నికల్లో ఏ అభ్యర్ధి క్రియేట్ చేయని రికార్డ్ బిడెన్ క్రియేట్ చేశారు.

ఇంతకీ ఆ రికార్డ్ ఏమిటంటే.


ఎన్నికల ప్రచారం కోసం బిడెన్, ట్రంప్ లు హోరా హోరీ పోరు చేసిన విషయం విధితమే.

అయితే ఈ ఎన్నికల్లో మాత్రం బిడెన్ ప్రచారం కోసం అత్యధికంగా డబ్బును ఖర్చు చేశారట.దాంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ఖర్చులో బిడెన్ ఈ రికార్డ్ సృష్టించారు.

జో బిడెన్ గత ఏడాది నుంచీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.అయితే అప్పటి నుంచీ ఇప్పటివరకూ కూడా కేవలం టెలివిజన్ ప్రచార ఖర్చుల కోసం దాదాపు 582 మిలియన్ డాలర్లు పైగానే ఖర్చు చేశారట.

అమెరికా చరిత్రలో ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకూ ఆ స్థాయిలో ఖర్చు చేసిన అభ్యర్ధి లేనేలేడని అంటున్నారు.ఈ విషయాలను ది హిల్ న్యూస్ వెబ్ సైట్ బహిర్ఘతం చేసింది.

కేవలం గడించిన వారం రోజుల్లో బిడెన్ 45 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారట.ఇదిలాఉంటే ఇక అధికారంలో ఉన్న ట్రంప్ గడించిన ఏడాదిగా ప్రచారాల కోసం 342 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని సదరు సంస్థ వెల్లడించింది.

అంతేకాదు ట్రంప్ బిడెన్ మద్దతు దారులు అక్టోబర్ నెల మొదలు ఇప్పటి వరకూ సుమారు లక్షకి పైగా ప్రకటనలు ఇచ్చారని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube