దడ పుట్టిస్తున్న డెల్టా...ఇది బిడెన్ హెచ్చరిక...!!!

అగ్ర రాజ్యం లేదు, ముష్కరులు లేదు, మంచోడు, చెడ్దోడు అనే భేదం అస్సలు లేదు, కరోనాకు ఎవరైనా ఒకరే అందుకే మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.కరోనా మొదలైన సమయంలో అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కరోనా ఆ తరువాత సెకండ్ వేవ్ లో భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

 Joe Biden Delta Variant Americans-TeluguStop.com

ఇక థర్డ్ వేవ్ ఈ సారి ఏ దేశాన్ని టార్గెట్ చేస్తుందో, ఏ దేశ ప్రజలు దొరుకుతారోనని ఎవరికి వారు ఆందోళన చెందుతున్నారు.అయితే సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ , వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపై కరోనా తీవ్రత అంతగా ఉండదు అంటున్నారు నిపుణులు.

కానీ ఈ సూత్రాలు పాటిస్తూ వ్యాక్సినేషన్ విషయంలో తాము ఫుల్ సక్సస్ అని చెప్పుకున్న బిడెన్ ప్రభుత్వానికి డెల్టా దడ పుట్టిస్తోంది.

 Joe Biden Delta Variant Americans-దడ పుట్టిస్తున్న డెల్టా…ఇది బిడెన్ హెచ్చరిక…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


అమెరికా వైద్య నిపుణులు, అలాగే ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ, అమెరికా అధ్యక్షుడు బిడెన్ అందరూ వరుస పెట్టి మీడియా ముఖంగా ప్రజలను చైతన్యవంతులు చేయడం మొదలు పెట్టారు.

తాజాగా అధ్యక్షుడు బిడెన్ తాను అధ్యక్షుడిగా ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఇందులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బిడెన్ కరోన విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మరో మహమ్మారి డెల్టా రూపంలో విరుచుకుపడుతోందని, ప్రజలు ఏ మాత్రం అశ్రద్ద వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.అంతేకాదు

వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు మనం పూర్తి చేసుకున్నామని, ఈ కారణంగానే అమెరికాలో కరోనా కేసులు, మరణాలు తగ్గాయనికానీ డెల్టా పూర్తిగా భిన్నమైన వేరియంట్ అని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కరోనా మరణాలు పూర్తిగా 90 శాతం తగ్గాయని ఇలా అనుకున్న సమయంలోనే దేశ వ్యాప్తంగా రోజులు కరోనా కేసులు 80 శాతం నమోదు అవుతున్నాయని అన్నారు.

రోజుకు 80 శాతం అంటే డెల్టా ఏ స్థాయిలో విస్తరిస్తోంది అనేది ప్రజలు ఆలోచన చేయాలని, ప్రస్తుతం డెల్టా కేసుల్లో అత్యధికంగా వ్యాక్సిన్ తీసుకొని వారు ఉన్నారని, చనిపోతున్న వారిలో కూడా వ్యాక్సిన్ తీసుకొని వారే ఎక్కువగా ఉన్నారని బిడెన్ ప్రకటించారు.

ప్రతీ ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని డెల్టా నుంచీ తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ తీసుకుని ఉండటం ఎంతో అవసరమని సూచించారు.వైద్య నిపుణులతో పాటు,అధ్యక్షుడు బిడెన్ సైతం డెల్టా వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తం చేస్తున్నారంటే దాని ప్రభావం ఎలా ఉండబోతోందో రోజు రోజుకు అక్కడ పెరుగుతున్న డెల్టా కేసులను బట్టి అర్ధం చేసుకోవచ్చుని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

#Delta Variant #JoeBiden #America #COVID Cases #Americans

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు