నెరవేరుతున్న బైడెన్ స్వప్నం.. అమెరికన్ల ఖాతాల్లోకి ప్యాకేజీ ఫలాలు..!!

కరోనా మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి.ద అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తామని ఆయన చెప్పారు.ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.

 $1,400 Stimulus Checks Start Arriving In Bank Accounts As Biden Hits Road To Tou-TeluguStop.com

పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ ఇప్పటికే తెలిపారు.సెనేట్, కాంగ్రెస్‌లలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై గురువారం అధ్యక్షుడు సంతకం చేయడంతో అది చట్టరూపం దాల్చింది.

దీంతో ప్రజలకు ఆర్ధిక సాయాన్ని పంచడం మొదలుపెట్టారు.

దీని ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందనుంది.

ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు (సుమారు రూ.లక్ష) జమ చేయనున్నారు.దీనిలో భాగంగా శుక్రవారం నుంచి ఫస్ట్ బ్యాచ్‌కు 1400 డాలర్ల పంపిణీని ప్రారంభించినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) వెల్లడించింది.ఈ మొదటి బ్యాచ్ పేమెంట్లను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఐఆర్‌ఎస్ పేర్కొంది.

ఈ వారాంతంలో ఆ సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు తెలిపారు.అలాగే ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు.

నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్, టెస్టుల కోసం మరో 50 బిలియన్‌ డాలర్లు కేటాయించనున్నారు.

Telugu Stimulusstart, Americans, Covid Package, Covid Vaccine, Joe Biden, July-T

కాగా కోవిడ్‌పై యుద్ధంలో భాగంగా జో బైడెన్ ఈసారి మరో సరికొత్త లక్ష్యాన్ని ప్రజలకు నిర్దేశించారు.దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4 నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఒక‌వేళ దేశ‌మంతా వ్యాక్సిన్ తీసుకుంటే.జూలై నాలుగ‌వ తేదీన కోవిడ్ నుంచి మ‌న‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన‌ట్లే అని బైడెన్ స్పష్టం చేశారు.క‌రోనా వైర‌స్‌ను మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించి ఏడాది గడుస్తున్న నేప‌థ్యంలో గురువారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బైడెన్.మే ఒక‌టో తేదీ నాటికి ప్ర‌తి రాష్ట్రంలో ఉన్న వృద్ధులు టీకాలు తీసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌స్తుతం వ‌య‌సు, ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా టీకాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.దేశ ప్ర‌జ‌లంతా టీకా తీసుకుంటే.

ప్ర‌తి ఒక్క‌రూ సంబ‌రాలు చేసుకునే సంద‌ర్భం వ‌స్తుంద‌ని బైడెన్ ఆకాంక్షించారు.అంద‌రం టీకా వేసుకుంటే, జూలై 4వ తేదీన బంధుమిత్రుల‌తో స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకునే అవకాశం ఉంద‌ని ఆయ‌న గుర్తుచేశారు.

ఇది కేవ‌లం దేశ స్వాతంత్ర్య దినోత్సవం మాత్ర‌మే కాదన్న ఆయన.వైర‌స్ నుంచి కూడా అమెరికా స్వాతంత్య్రం పొందిన‌ట్లు అని అభివర్ణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube