బిడెన్ కి “భారతీయ సిక్కుల” పై ఎంత ప్రేమో..!  

Biden campaign launches initiative to woo Sikhs in US, Joe Biden, US, Indian Sikhs,Sikh Americans, America Elections, Democratic Party - Telugu America Elections, Biden Campaign Launches Initiative To Woo Sikhs In Us, Democratic Party, Indian Sikhs, Joe Biden, Sikh-americans, Us

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కేవలం నాలుగు వారాల వ్యవధి మాత్రమే ఉంది.ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు తమ ప్రచారాల్లో స్పీడు పెంచుతున్నారు.

TeluguStop.com - Joe Biden Campaign American Sikhs Elections

ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో తలమునకలై పోతున్నారు.ముఖ్యంగా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ అమెరికాలోని స్థానిక ఓట్ల కంటే కూడా వలస, అలాగే మైనారిటీ, ఓట్లపై గురిపెడుతున్నారు.

ముఖ్యంగా భారతీయ ఓటర్లు, అందులోనూ భారత్ నుంచీ అమెరికా వలస వెళ్లి స్థిరపడిన వారిలో అత్యధికులైన సిక్కు ఓట్లపై బిడెన్ వర్గం గురి పెడుతోంది.వారిపై ఎనలేని ప్రేమని కురిపిస్తోంది.

TeluguStop.com - బిడెన్ కి “భారతీయ సిక్కుల” పై ఎంత ప్రేమో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సిక్కు అమెరికన్స్ పై గడిచిన కొంత కాలంగా జాత్యహంకార దాడులు జరిగాయని, ఎంతో మంది మృతి చెందారు మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారని బిడెన్ వర్గం చెప్పుకొస్తోంది.అందుకే బిడెన్ ప్రత్యేకంగా సిక్కు అమెరికన్స్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారని తెలుస్తుంది.

బిడెన్ కోసం సిక్కు అమెరికన్స్ మద్దతుగా ఉన్నారంటూ బిడెన్ వర్గం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో సిక్కులు ఏ విధంగా కొన్ని ఏళ్ళుగా వివక్షని ఎదుర్కుంటున్నారు అనే విషయాలని హైలెట్ చేసి చూపించనున్నారు.

అమెరికాలోని స్కూల్స్, కాలేజీలలో అత్యధికంగా సిక్కులపైనే దాడులు జరుగుతున్నాయని, వీటిని కంట్రోల్ చేయడానికి ప్రత్యేక కార్యాచరణ బిడెన్ రూపొందిస్తున్నారని అన్నారు.ట్రంప్ సిక్కులకి ఏ మాత్రం కూడా న్యాయం చేయలేక పోయారని, మేము ఈ విషయంలో ట్రంప్ కి మద్దతు ఇవ్వడం లేదని సిక్కు వర్గానికి చెందిన ప్రతినిధులు అంటున్నారు.

బిడెన్ అధికారంలోకి వస్తే మన పిల్లలు స్కూల్స్ , కాలేజీలలో స్వేచ్చగా తిరుగుతారని అందుకే వచ్చే ఎన్నికల్లో బిడెన్ ని మనం గెలిపించి తీరాలని పిలుపునిచ్చారు.

#Sikh-Americans #Indian Sikhs #BidenCampaign #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Joe Biden Campaign American Sikhs Elections Related Telugu News,Photos/Pics,Images..