కేబినేట్‌లో ఈ ఇద్దరు ఇండో అమెరికన్లు బరువయ్యారా... బైడెన్‌ వైఖరేంటి..?

అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కేబినేట్‌లో 20 మందికి పైగా ఇండో అమెరికన్లకు చోటు కల్పించారు జో బైడెన్.తాను అధికారంలోకి రావడానికి సాయం చేశారన్న కృతజ్ఞత కావచ్చు.భారతీయుల సత్తాపై వున్న నమ్మకం కావొచ్చు.ఏది ఏమైనా కీలక బాధ్యతలు మొత్తం భారత సంతతి వ్యక్తుల చేతుల్లోనే పెట్టారు అమెరికా అధ్యక్షుడు.అయితే ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఇండో అమెరికన్లకు మాత్రం బైడెన్ ఎలాంటి పదవిని ఇవ్వకపోవడం అమెరికాలోని భారతీయ సమాజంలో పెద్ద చర్చకు కారణమైంది.ఒబామా హయాంలో పనిచేసిన సోనాల్‌షాతో పాటు బైడెన్‌ ప్రచార బృందంలోని ముఖ్య వ్యక్తి అమిత్‌ జానీని కూడా కొత్త అధ్యక్షుడు కేబినేట్‌లో మినహాయించారు.
వారికి ఆర్‌ఎస్‌ఎస్‌.బిజెపిలతో ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో.అటువంటి హౌడీ మోడీ బృందాన్నీ బైడెన్‌ తన కేబినేట్‌ నుండి సగౌరవంగా తప్పించారు.సీనియర్‌ దౌత్యవేత్త, దేవానీ ఘోబర్‌ గేడ్‌ కేసులో ప్రధాన పాత్ర పోషించిన ఉజ్రాజెయా, సిఎఎ, ఎన్‌ఆర్‌సిలతో పాటు కాశ్మీర్‌లో లాక్‌డౌన్‌ను నిరసిస్తూ.

 Indian-americans With Rss Links Don’t Make It To Biden’s First Cut, Rss Link-TeluguStop.com

ర్యాలీలో పాల్గన్న సమీరా ఫాజిలి వంటి వ్యక్తులకు సైతం బైడెన్‌ తన జట్టులో స్థానం కల్పించారు.ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపితో సంబంధాలు ఉన్న వారికి చోటు దొరక్కపోవడంతో.

లౌకిక భారతీయ అమెరికన్‌ సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తులకు స్థానం కల్పించకూడదంటూ బైడెన్‌- హారిస్‌ ద్వయంపై ఒత్తిడి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Telugu Amit Jani, Indian American, Indianamericans, Joe Biden, Rss Bjp, Rss Link

హిందూత్వ వాదాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థల ప్రోత్సాహంతో గద్దెనెక్కిన ప్రభుత్వం కావడంతో.బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూలురకు స్థానం కల్పించకపోవడం ఉత్తమమని డెమొక్రాట్లు ఆలోచించి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీ ప్రెస్టన్‌ కులకర్ణికి భారత- అమెరికన్‌ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం రావడం.

అమెరికా మాజీ కాంగ్రెస్‌ సభ్యురాలు తులసి గబ్బర్డ్‌లు కూడా ఇదే కారణంతో ఓటమి పాలవడం ప్రధాన కారణమై ఉండవచ్చని తెలిపాయి.

సోనాల్‌ షా.బైడెన్‌ యూనిటీ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశారు.అయితే ఆమె తండ్రికి భారత్, అమెరికాలలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉండటం, అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ నడుపుతున్న ఎకల్‌ విద్యాలయ స్థాపకుడు కావడంతో ఆమెను పక్కకు తప్పించారు.

అమిత్‌ జానీ విషయానికి వస్తే ఆయన కుటుంబానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇకపోతే ఆర్‌ఎస్‌ఎస్‌ / బిజెపితో సంబంధాలు ఉన్నవారిని మినహాయించడంలో ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ 19 భారతీయ అమెరికన్‌ సంస్థలు బైడెన్‌కు లేఖ రాయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube