అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్( US President Joe Biden ) బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక పదవుల్లో భారతీయులను నియమిస్తూ వస్తున్నారు.దీనిపై సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు.
కమలా హారిస్, నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి, వినయ్ రెడ్డి, వనితా గుప్తా, ఉజ్రా జాయే, మాలా అడిగా,గరీమా వర్మ, సబ్రీన్ సింగ్, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తితో పాటు ఎంతోమంది కీలక హోదాల్లో వున్నారు.వీరంతా తమ ప్రతిభతో భారత్- అమెరికాలకు గర్వ కారణంగా నిలుస్తున్నారు.
అలా జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 130 మంది ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.యునైటెడ్ స్టేట్స్ జనాభాలో ఒక శాతంగా వున్న భారతీయులకు దేశ పాలనలో ఈ స్థాయిలో అవకాశాలు దక్కడం నిజంగా మనం గర్వించాల్సిన విషయమే.
తాజాగా మరో భారత సంతతి మహిళ షమీనా సింగ్‌ను( Shamina Singh ) కీలక పదవిలో నియమించారు జో బైడెన్.అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రధాన జాతీయ సలహా కమిటీగా పనిచేస్తున్న ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా( Presidents Export Council ) షమీనాను నియమించారు.
మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలిగా, ప్రెసిడెంట్‌గా ఆమె పనిచేస్తున్నారు.దీనిపై షమీనా స్పందిస్తూ.ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ లీడర్ల సమూహంలో చేరడం తనకు దక్కిన గౌరవం అన్నారు.

ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రధాన జాతీయ సలహా కమిటీగా పనిచేస్తుంది.అమెరికా వాణిజ్య పనితీరును ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలు , కార్యక్రమాల విషయంలో అధ్యక్షుడికి కౌన్సిల్ సలహా ఇస్తుంది.వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ, కార్మిక , ప్రభుత్వ రంగాలలో వాణిజ్య సంబంధిత సమస్యలను చర్చించడానికి పరిష్కరించడానికి ఒక వేదికను అందిస్తుంది.

షమీనా సింగ్ మాస్టర్ కార్డ్‌లో( Master Card ) సస్టైనబిలిటీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్నారు.అలాగే కంపెనీ మేనేజ్‌మెంట్ కమిటీలో సభ్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆస్తులను ప్రభావితం చేసే ప్రత్యేకమైన సామాజిక ప్రభావ నమూనాను అభివృద్ధి చేయడంలో షమీనా సింగ్‌కు 20 ఏళ్ల అనుభవం వుంది.2018లో మాస్టర్ కార్డ్ 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మాస్టర్ కార్డ్ ఇంపాక్ట్ ఫండ్‌ని సృష్టించింది.దీనికి షమీనా సింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

గతంలో వైట్‌హౌస్, యూఎస్ ప్రతినిధుల సభలలో ఆమె ఉన్నత పదవులను నియమించారు.ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులపై తొలి ప్రెసిడెంట్ అడ్వైజరీ కమీషన్‌కు షమీనా సింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.2015లో ఆమెను అమెరికార్ప్ బోర్డులో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు.పబ్లిక్ ఇష్యూస్‌పై యాడ్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా అడ్వైజరీ కమిటీకి కో చైర్‌గా.ఆస్పెన్ ఇన్‌స్టిట్యూట్ సివిల్ సొసైటీ ఫెలోషిప్ , న్యూయార్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్నోవేషన్ అడ్వైజరీ బోర్డ్‌లలో ఆమె పనిచేస్తున్నారు.
హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్నారు.ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఆస్టిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లోని లిండన్ బి.జాన్సన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ పట్టా పొందింది.