వేటు తప్పదు..బిడెన్ సంచలన నిర్ణయం..!!

అమెరికా అధ్యక్షుడుగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అధికారులను, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగ కూడదని, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు.ఈ క్రమంలోనే న్యూయార్క్ గవర్నర్ పై లైంఘిక వేధింపుల ఆరోపణలు రావడంతో బిడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి సర్వాత్రా నెలకొంది.

 Joe Biden Says Andrew Cuomo Should Resign If Allegations Confirmed,  Joe Biden,-TeluguStop.com

ఈ విషయంపై తాజాగా స్పందించిన అధ్యక్షుడు బిడెన్ ఆండ్రూ క్యూమో పై సంచలన వ్యాఖ్యలు చేశారు.వివరాలలోకి వెళ్తే.


గడించిన కొన్ని రోజులుగా న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో పై లైంఘిక ఆరోపణలు వస్తున్న విషయం విధితమే.దాదాపు ఎనిమిది మంది మహిళలు ఆండ్రూ తమని లైంఘికంగా వేధించాడని ఆరోపించారు.

దాంతో ఆండ్రూ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత మొట్ట మొదటి సారిగా తన సొంత పార్టీ కీలక, సీనియర్ నేతపై ఆరోపణలు రావడంతో డెమోక్రటిక్ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ క్రమంలోనే బిడెన్ ఆండ్రూ విషయంపై మొట్టమొదటి సారిగా స్పందించారు.

Telugu America, Andrew Cuomo, Joe Biden, Joebiden, York Governor-Telugu NRI

మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బిడెన్ సమాధానం ఇచ్చారు.మీ పార్టీకి చెందిన ఆండ్రూ పై ఆరోపణలు వస్తున్నాయి మీరు ఈ పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగా అవి ఆరోపణలు మాత్రమే కానీ నేరం రుజువైతే తప్పకుండా ఆండ్రూ తన గవర్నర్ గిరీకి రాజీనామా చేస్తారని తెలిపారు.తమకు ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదని ఎవరు తప్పు చేసినా తప్పకుండా శిక్ష ఉంటుందని తెలిపారు.ఇదిలాఉంటే ఆండ్రూ గడించిన 10 ఏళ్ళుగా న్యూయార్క్ గవర్నర్ గా కొనసాగుతూనే ఉన్నారు.2022 వరకూ ఆయన గవర్నర్ గా విధులు నిర్వహించనున్నారు.తాజా ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉన్నయాని మరో పక్క మహిళలు చెప్పడంతో ఆండ్రూ పదవిపై సందిగ్ధత నెలకొంది.అంతేకాదు బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓ డెమోక్రటిక్ పార్టీ నేతపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube