ఏం చేసినా ఎలక్షన్ స్టంటే: భారతీయులకు బిడెన్ నవరాత్రి శుభాకాంక్షలు  

Joe Biden and Kamala Harris in Navratri Wish to Hindus Joe Bidden, Kamala Harris, Devinavaratri Wishes, America President Elections, Democrats, Republicans, - Telugu America President Elections, Democrats, Devinavaratri Wishes, Joe Bidden, Kamala Harris, Republicans

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.ఈ నేపథ్యంలో గెలుపొటములను నిర్దేశించే నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారతీయులను ప్రసన్నం చేసుకునేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కిందా మీదా పడుతున్నారు.

TeluguStop.com - Joe Biden And Kamala Harris In Navratri Wish To Hindus

ఒకరిని మించి మరొకరు సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తున్నారు.దీనిలో ముందు వరుసలో ఉన్నారు డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్.

అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన మిస్ చేయడం లేదు .

TeluguStop.com - ఏం చేసినా ఎలక్షన్ స్టంటే: భారతీయులకు బిడెన్ నవరాత్రి శుభాకాంక్షలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో బిడెన్ శుభాకాంక్షలు తెలియజేశారు. “హిందువులు జరుపుకునే నవరాత్రులు మొదలయ్యాయి.అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఈ పండుగ జరుపుకునే వారందరికీ నేను, జిల్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.

మరోసారి చెడుపై మంచి గెలవాలని, మెరుగైన భవిష్యత్తు దిశగా శుభోదయం జరగాలని, అందరికీ అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాం” అంటూ జో బిడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.అంతకుముందు వినాయక చవితి సందర్భంగా అమెరికాలోని తెలుగు వారితో పాటు భారత ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా గణేష్‌ చతుర్థిని జరుపుకునే తెలుగు వారందరికి బిడెన్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా అమెరికాలోని దాదాపు నాలుగింట మూడొంతుల మంది భారతీయ-అమెరికన్లు ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో0 బిడెన్‌కే ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడయ్యింది.ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా తిరోగమిస్తోందని భారతీయ అమెరికన్లు బలంగా నమ్ముతున్నారు.

ఇక, భారతీయ-అమెరికన్ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్ ఎంపిక చేసిన తర్వాత భారతీయులు డెమొక్రాట్లవైపు మెగ్గుచూపినట్టు సర్వేలో బహిర్గతమయ్యింది.మొత్తం 72 శాతం మంది భారతీయ-అమెరికన్లు బిడెన్‌కు మద్దతు ఇస్తుండగా.

ట్రంప్‌కి కేవలం 22 శాతం మంది మాత్రమే ఓటేస్తామని చెప్పారు.మిగతా 6 శాతం మంది ఈ ఇద్దరిలో ఎవరికీ ఓటేయమని తెలిపారు.

కార్నేగ్ ఇండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్ హాప్కిన్స్-ఎస్ఐఏఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సుల్వేనియా సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి.

#Kamala Harris #Republicans #Democrats #Joe Bidden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Joe Biden And Kamala Harris In Navratri Wish To Hindus Related Telugu News,Photos/Pics,Images..