ట్రంప్ వేసిన పునాదులపై.. బైడెన్ సౌధం, కరోనాపై పోరులో అమెరికా విజయాలు

ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.

 Joe Biden And Donald Trump Saved America From Corona, Trump, Biden, Corona Vacci-TeluguStop.com

ఇవి గతేడాది సరిగ్గా ఇదే రోజుల్లో అమెరికాలో కనిపించిన పరిస్ధితులు. కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని.

అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్‌గా తీసుకోవడంతో తానెంత డేంజరో కోవిడ్ రుచి చూపింది.చూస్తుండగానే చాప కింద నీరులా దేశం మొత్తం వైరస్ వ్యాపించింది.

జనం పిట్టల్లా రాలిపోవడంతో పాటు లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.ఈ భూమ్మీద కోవిడ్‌తో తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుందంటే అది అమెరికాయే.

ఆ పరిస్ధితి చూస్తే.అగ్రరాజ్యంలో చివరికి ఎంతమంది మిగులుతారోనంటూ కామెంట్లు వినిపించాయి.

కానీ క్రమంగా పరిస్దితులు మెరుగుపడ్డాయి.

వైరస్ వ్యాప్తి తగ్గడంతో ఏడాది నుంచి అమల్లో ఉన్న ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వాషింగ్టన్‌లో రోజువారీ వైరస్ వ్యాప్తి రేటు లక్షకు అత్యల్పంగా 14 కేసులుగా నమోదైంది.మే 1 నుంచి జిమ్స్, ఫిట్‌నెస్ సెంటర్లను 50 శాతం సామర్థ్యంతో అనుమతించింది.

అలాగే, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో లైవ్ మ్యూజిక్‌ను కూడా అనుమతించనున్నట్టు నగర మేయర్ తెలిపారు.కాన్సెర్ట్ హాళ్లు, సినిమా థియేటర్ల సామర్థ్యాన్ని 25 శాతానికి పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

పబ్లిక్ పూల్స్‌ను 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామన్నారు.అలాగే మాస్క్‌లు లేకుండా తిరిగేందుకు కూడా సీడీసీ అనుమతించింది.

రెండు వ్యాక్సిన్లు పూర్తయిన వారు మాస్క్‌లు పెట్టుకోనక్కర్లేదని తెలిపింది.

అయితే ఇదంతా ఒక్కరోజులో జరగలేదు.

ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంతో పాటు ప్రజల సహకారంతో అమెరికా మహమ్మారి ముప్పు నుంచి నెమ్మదిగా బయటపడుతోంది.జనాభాలో సగం మందికిపైగా టీకాలు వేయడంతో పాటు తమ అవసరాలకు మించి టీకా నిల్వలను అమెరికా సాధించుకోగలిగింది.

ఈ విజయానికి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, తాజా అధ్యక్షుడు బైడెన్‌ ఇద్దరూ కారకులే.తొలుత కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రంప్.

ఆ తర్వాత ‘ఆపరేషన్‌ వార్ప్‌స్పీడ్‌’ పేరిట టీకాల తయారీకి వ్యూహ రచన చేశారు.‘కేర్స్‌ యాక్ట్‌ (కరోనా వైరస్‌ ఎయిడ్‌, రిలీఫ్‌, అండ్‌ ఎకనమిక్‌ సెక్యూరిటీ) పేరిట 10 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.75 వేల కోట్ల) నిధిని ఏర్పాటు చేసి పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఫార్మా కంపెనీలను వ్యాక్సిన్ తయారీకి ప్రోత్సహించారు.అనంతరం బర్డా (బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) ద్వారా మరిన్ని అదనపు నిధులు సమకూర్చారు ట్రంప్.

ఇదే సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాత అమెరికా అవసరాలకు ఎన్ని డోసులు కేటాయించాలో కూడా కంపెనీలతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారు.

ఇక జనవరి 20న అధికారపగ్గాలు చేపట్టిన బైడెన్ .ట్రంప్‌ బాటలోనే నడిచారు.100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.దాన్ని కూడా 10 రోజుల ముందే.

అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube