శ్వేత సౌధంలోకి...బిడెన్ పెంపుడు కుక్కలు..ఇక రాజభోగమే..!!  

joe bidden pet dogs moved into white house , biden, trump, white house, champ - Telugu Biden, Champ, Trump, White House

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన అధికారిక నివాసం వైట్ హౌస్ లోకి తన రెండు పెంపుడు కుక్కలు తీసుకొచ్చారు.ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది.

TeluguStop.com - Joe Bidden Pet Dogs Moved Into White House

ఎందుకంటే.గతంలో ఏ అధ్యక్షులు వైట్ హౌస్ లోకి అడుగు పెట్టినా తమకి ఇష్టమైన వస్తువులను లేదంటే పెంపుడు జంతువులను తెచ్చుకునే వారు.

ఒబామా హయాంలో కూడా తన ఇద్దరు పిల్లలు ఎంతగానో ఇష్టపడిన బో , సన్నీ అనే అరుదైన జాతికి చెందిన కుక్కలను తెచ్చుకున్నారు.వాటిని బయటకు స్వయంగా ఒబామా తీసుకెళ్ళే వారు, ఆటలు ఆడేవారు.

TeluguStop.com - శ్వేత సౌధంలోకి…బిడెన్ పెంపుడు కుక్కలు..ఇక రాజభోగమే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఓబమా తరువాత అధ్యక్షుడిగా వచ్చిన ట్రంప్.

వైట్ హౌస్ లోకి ఎలాంటి జంతువులను తీసుకురాలేదు.

అసలు వారికి జంతుల పెంపకం మీద కూడా ఆసక్తి లేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ట్రంప్ కు మనుషులను ప్రేమించడం , గౌరవించడం తెలియదు ఇక జంతువులను ఏం పెంచుతాడు అంటూ ట్రోల్ కూడా చేశారు.

అయితే వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన నూతన అధ్యక్షుడు బిడెన్ తన పెంపుడు కుక్కలు రెండింటిని వైట్ హౌస్ లోకి తెచ్చుకున్నారు. బిడెన్ గతంలో రెండు జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కలను ఓ సంస్థ నుంచీ దత్తత తీసుకున్నారు.

Telugu Biden, Champ, Trump, White House-Telugu NRI

చాంప్, మేజర్ అని బిడెన్ ఎంతో ముద్దుగా పిలుచుకునే ఈ రెండు కుక్కలు అంటే బిడెన్ దంపతులకు ఎంతో ఇష్టం.వీటిని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటారు.బిడెన్ రోజు వీటిని బయటకు తీసుకువెళ్ళి వాటితో ఆటలు ఆడాల్సిందే.ఎన్నికల సమయంలో చాంప్ అనే కుక్కను బయటకు తీసుకువెళ్ళి ఆడుతున్న క్రమంలోనే కాలిగి గాయం కూడా అయ్యింది.

అప్పుడే చాంప్ ఫుల్ ఫేమస్ అయ్యింది కూడా.ఇప్పుడు ఈ రెండు కుక్కలు వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాయి.

ఇకపై వీటికి ప్రత్యేకమైన పర్యవేక్షకులు కూడా ఉంటారు.బిడెన్ తో పాటు సమానమైన గౌరవం వీటికి అక్కడి సిబ్బంది ఇస్తారు.

ఇక మీడియా కవరేజ్, వగైరా వగైరా చెప్పనక్కర్లేదు.

#Trump #Biden #White House #Champ

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు