అందరి ముందు రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న జోబైడెన్..!!  

Jobaiden, corona vaccine, america,trump - Telugu America, Corona Vaccine, Jobaiden, Trump

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలబడి ట్రంపు పై గెలిచిన జోబైడెన్ తాజాగా  కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.

  కరోనా టీకా రెండో డోసు వేయించుకుంటున్న సమయంలో కొంత ఒత్తిడికి గురైనట్లు తెలిపారు.దేశంలో ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రధాన కర్తవ్యమని బైడెన్ అన్నారు.

అమెరికాలో వినియోగిస్తున్న ఫైజర్ వ్యాక్సిన్ చాలా సురక్షితం అని చెప్పుకొచ్చారు.అమెరికాలో కరోనా వ్యాక్సిన్  విషయంలో అనేక అనుమానాలు ఉండటంతో 78 సంవత్సరాల వయసు కలిగిన బైడెన్ మీడియా ముందు వ్యాక్సిన్ వేయించుకోవడం తో.అమెరికా దేశంలో ఉన్న మీడియా చానల్స్ మొత్తం.కొత్త అధ్యక్షుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

ముఖ్యంగా మొదటి డోసు వేయించుకున్నవారు తప్పనిసరిగా రెండో డోసు కూడా వేయించుకోవాలి అని వైద్య బృందాలు తెలపడంతో.అందరి ముందు కొత్త అధ్యక్షుడు బైడెన్ రెండో టీకా కూడా వేయించుకున్నారు.

మొదటిగా గత నెల 21వ తారీఖున వేయించుకోవడం జరిగింది.ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

 

#America #Jobaiden #Corona Vaccine #Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు