ఉద్యమ కార్యాచరణ దిశగా ఉద్యోగ సంఘాలు... కెసీఆర్ స్పందించేనా?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన జీవో 317 పై రగడ అనేది కొనసాగుతూ ఉంది.అయితే ఉద్యోగ సంఘాలు తాము కోరుకున్న చోట బదిలీలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో మెజారిటీ ఉద్యోగులు ఇప్పటికే బదిలీ చేసిన స్థానాల్లో చేరడంతో ప్రభుత్వం కూడా కొంత మంది ఉద్యోగుల ఆందోళనలను పరిగణలోకి తీసుకోలేదు.

 Job Unions Towards Movement Activity Will Kcr Respond , Telangana Politics , Kcr , Revanth Reddy , Telangana Congress ,-TeluguStop.com

అయితే సాధ్యమైనంత వరకు జీవో 317 సవరణ జరిగేలా ఒత్తిడి తీసుకొద్దామని ప్రయత్నించినా కెసీఆర్ నుండి ఎటువంటి స్పందన అనేది రాలేదు.అంతేకాక ఇప్పటికే ఉద్యోగులు కూడా విధుల్లో కూడా చేరడంతో ప్రతిపక్షాలు కూడా కాస్త వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఎక్కడా తగ్గకపోవడంతో ఇక అంతా సైలెంట్ అయి పోయారు.

అయితే తాజాగా ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలవడంతో మరోసారి అందరి దృష్టి జీవో 317 పై పడింది.అయితే ఇప్పటికే బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో ఖాళీలపై కాస్త స్పష్టత వచ్చిన పరిస్థితి ఉంది.ఇక ప్రభుత్వం ఏర్పడ్డ ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ఇక ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇప్పటికే నిరసనలతో ఎంతో కొంత చర్చ కు దారి తీసిన ఉద్యోగులు రెండో సారి నిరసనలతో ప్రభుత్వం స్పందిస్తుందా అంటే కొంత ప్రశ్నార్థకమనే చెప్పాలి.

 Job Unions Towards Movement Activity Will KCR Respond , Telangana Politics , Kcr , Revanth Reddy , Telangana Congress , -ఉద్యమ కార్యాచరణ దిశగా ఉద్యోగ సంఘాలు#8230; కెసీఆర్ స్పందించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్థానికంగా నిరసనలు మరల ఎందుకు జరుగుతున్నాయనే విషయం కెసీఆర్ వరకు రావడం ద్వారానే ఇక మరల స్పందించే అవకాశం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.మరికొందరు జీవో 317 అనేది ముగిసిపోయిన అధ్యాయమని ఇక ఏమి చేసినా రాజకీయ ప్రేరేపిత నిరసనలగానే ప్రజలు భావిస్తారని కెసీఆర్ వ్యూహంలో మరో సారి పడే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలలోని పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Job Unions Towards Movement Activity Will KCR Respond , Telangana Politics , Kcr , Revanth Reddy , Telangana Congress , - Telugu @cm_kcr, @revanth_anumula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube