లిమిటెక్స్‌లో ఉద్యోగాలంటూ ప్రకటన..తీరా చూస్తే..!

మోసపోయేవారున్నని రోజులు మోసం చేసే వారు కొదవా? సైబర్‌ నేరగాళ్లు ఇప్పటికే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను కూడా చేయనివ్వకుండా ఎన్నో విధాలుగా వల పన్నుతారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.

 Job Seekers Cheated Through Online Job Portal  Cyber Crime,  Job Offer , Fake Ne-TeluguStop.com

అయితే, ఇప్పుడు జరిగిన ఓ సంఘటన కూడా నిరుద్యోగుల ఆశలపై నీరు చల్లినట్లయింది.ఏదో గూగుల్‌ సైట్‌ ఆధారంగా ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు అని ప్రకటన ఇచ్చారు.

దీంతో చాలా మంది నిరుద్యోగులు ఫోన్ల ద్వారా వారిని సంప్రదించారు.చివరికి రూ.27 లక్షల వరకు వాళ్లనుంచి వసూలు చేసిన తర్వాత తెలిసింది అదో ఫేక్‌ సైట్‌ అని! పాపం వారంతా ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారు.ఏదో చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రులకు ఆసరాగా ఉందమని, పై చదువులకు వెళ్లకుండా పని చేసుకుందామని ఆశలు పెట్టుకున్నారు.

కానీ, వారి ఆశలు అడియాసలు అయ్యాయి.సాధారణంగా ఇంజినీర్ల లైఫ్‌ అంటేనే డిఫరెంట్‌.

అంటే చదువుకున్నని రోజుల ఎంజాయ్‌గా సాగిపోతుంది.ఆ తర్వాత తప్పనిసరిగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాలి.లేకపోతే వారి పరిస్థితి అంతే! ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి.ఇలాంటి వారిని మోసగించడానికే లిమిటెక్స్‌లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.

జాబ్‌ అనే సరికి అందరూ నమ్మేశారు.ముందుగా ఏదో ట్రైనింగ్‌ ఉంటదని.

మార్కుల ఆధారంగా కాకుండా.పని చూసి వేతనం నిర్ణయిస్తామని ప్రకటించేసరికి వారు కాంటాక్ట్‌ అవ్వాల్సి వచ్చింది.

ఫోన్లో మాట్లాడారు, ఆ వ్యక్తి ఏ కొంచెం జంకు లేకుండానే మాట్లాడాడు.

Telugu Lacs Scame, Cyber, Engineer, Google, Googlesearch, Job-Latest News - Telu

మీకు నచ్చిన పోస్టు కావాలంటే కాస్త డబ్బు డిపాజిట్‌ చేయాలన్నాడు.అలా దాదాపు 40 మంది ఉద్యోగం కోసం ఆశించి రూ.27.30 లక్షలు అతని ఖాతాకు ట్రన్స్‌ఫర్‌ చేశారు.ఇక తీరా రోజులు గడుస్తున్నా ఇదిగో అపాయింట్‌మెంట్‌ లెటర్‌.అదిగో అంటూ కాలం వెల్లదిశాడు.

చివరికి ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేయడంతో అప్పుడు తెలుసుకున్నారు వారు మోసపోయారని.అసలు ఆ మోసగాడు చెప్పిన అడ్రస్‌లో లిమిటెక్స్‌ అని ఏ సంస్థ లేదట.

చేసేదేం లేక వారిలో కొందరు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఇలా మరో విధంగా కూడా మోసగాళ్లు అమాయకులను మోసం చేయడానికి గోతి కాడ నక్కలాగా ఎదురు చూస్తారు.సరే! గూగుల్‌ వచ్చిన ప్రకటనే కదా! నిజమే అయి ఉంటుందని నమ్మా రు.ఇలా మరెంతో మంది నిరుద్యోగులు మోసపోయినవారు ఉన్నారు.మోసపోతూనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube