నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్షలు లేకుండానే ఎస్బిఐ లో ఉద్యోగాలు..?

నేటితరం జనరేషన్ లో బ్యాంకు ఉద్యోగాల కోసం పరితపించే పోయే యువకులు ఎంతో మంది.నెలల తరబడి బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎంతో నిరిక్షణగా ఎదురుచూస్తూ ఉంటారు.

 Job Notification From State Bank Of India,job,notification,sbi,short List,specia-TeluguStop.com

ఇక పోటీ పరీక్షల కోసం తెగ చదివేస్తున్నారు.ఇలా బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది.444 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఆసక్తి గల అభ్యర్థులు జులై 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటన విడుదల చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.దరఖాస్తు చేసే అభ్యర్థులు రెస్యూమ్, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలని సూచించింది.

అదే సమయంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎలాంటి పోటీ పరీక్ష రాయనవసరం లేదు అంటూ మరో తీపి కబురు చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.ఎస్బిఐ కమిటీ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి… వారందరికీ వంద మార్కులకు ముఖముఖి నిర్వహిస్తుంది అంటూ తెలిపింది.

అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది … 100 మార్కుల ముఖాముఖిలో ఇద్దరు అభ్యర్థులకు కటాఫ్ మార్కులు సమానంగా వస్తే… వయసు ఆధారంగా అభ్యర్థులను పోస్టుల కోసం ఎంపిక చేస్తామని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube