మీకు నచ్చిన చోటు నుంచే ఉద్యోగం.. గుడ్ న్యూస్ అందించిన కంపెనీలు..

కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రారంభించాయి.ప్రారంభంలో ఉద్యోగులు కొంత ఇబ్బంది పడ్డారు.

 Job From The Place Of Your Choice Companies That Provided Good News , Good News-TeluguStop.com

ఆ తర్వాత పూర్తిగా వర్క్ ఫ్రమ్ కే అలవాటు పడ్డారు.కరోనా పరిస్థితులు మెరుగుపడటంతో కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులను తిరిగి ఆఫీస్ లో పనిచేయించేందుకు సిద్ధమవుతున్నాయి.

అయితే ఉద్యోగులు ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గుచూతున్నారు.ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.

దీంతో ఉద్యోగులు నచ్చిన చోటు నుంచే జాబ్ చేసే విధంగా కంపెలు సదుపాయం కల్పించడానికి సిద్దమవుతున్నట్లు వర్కింగ్ స్పేస్ ప్రొవైడింగ్ కంపెనీ ఆఫీస్(AWFIS) చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

ఉద్యోగుల సౌలభ్యం, కంపెనీ అవసరాలను దృష్టి పెట్టుకుని హైబ్రిడ్ వర్క్ ప్లేస్ సదుపాయం కల్పించడానికి 53 శాతం కంపెనీలు ఇష్టపడుతున్నట్లు తెలిపింది.

హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అంటే ఉద్యోగి తన పనిని ఇంటి నుంచైనా లేదా ఆఫీస్ నుంచైనా చేయడం.ఉద్యోగి వారంలో కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు.

మిగిలిన కొన్ని రోజులు కార్యాలయాలకు వెళ్లొచ్చు.ఉద్యోగుల శ్రేయస్సులే ప్రధానంగా ఈ వర్క్ స్పేస్ వ్యూహాన్ని అమలు చేయాలని సంస్థలు భావిస్తున్నాయి.

అందులో భాగంగా 74 శాతం మంది తమ ఆఫీస్ లను లొకేషన్-సెంట్రిక్ నుంచి పీపుల్-సెంట్రిక్ వర్క్ స్పేస్ లుగా మార్చేందుకు చూస్తున్నాయి.

Telugu Employees, Job Place, Latest-Latest News - Telugu

ఈ హైబ్రిడ్ విధానం ఉద్యోగులు సులభంగా ఆఫీసులకు వచ్చేందుకు ఉపయోగపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.అంతేకాదు, ఈ విధానం ద్వారా కంపెనీలు రూరల్ ఏరియా నుంచి ఉద్యోగులను సెలెక్ట్ చేసుకుని వారితో అక్కడి నుంచే పని చేయించుకోవచ్చు.అందుకోసం డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ స్పేస్ ని ప్రారంచేందుకు కొన్ని సంస్థలు ఫ్టెక్స్ సెంటర్లను అడాప్ట్ చేసుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

తర్వాత తమ సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటాయని పేర్కొంది.ఈ నివేదికను చూస్తే.భవిష్యత్తులో సంప్రదాయ కార్యాలయాల స్థానంలో ప్లెక్స్ సెంటర్లు దర్శనమిచ్చే అవకాశం ఉంది.ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ ప్లేస్ స్ట్రాటెజి డబ్బు, సమయం ఆదా చేయడం, ఉద్యోగులు తమ దైనందిన జీవితాన్ని, పనిని సమతుల్యం చేసుకునేందుకు సహకరిస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube