ఉద్యోగం కావాలంటే నగ్న చిత్రాలు పంపామన్నారు...ఆమె తెలివిగా ఏం చేసిందో తెలుసా.?

స‌మాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి.వాటికి అడ్డు, అదుపూ ఉండ‌డం లేదు.

 Job Adigithe Nagna Chitralu Pampincha Mannaru-TeluguStop.com

మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు రెచ్చిపోతున్నాయి.వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాయి.

వాటికి క‌న్నూ మిన్నూ క‌నిపించ‌దు.వావి, వ‌రుస, చిన్న‌, పెద్ద అనే తేడాలు ఉండ‌వు.

పాశ‌వికంగా దాడి చేయ‌డ‌మే ప‌ని.అవ‌కాశం దొరికితే చాలు.

మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేయడానికి రెడీ అవుతున్నారు.వారిని పావులుగా వాడుకునేందుకు య‌త్నిస్తున్నారు.

వారికి ఉండే బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌ర‌గా చేసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

అలంటి ఓ మృగం నుండి ఓ మహిళ తెలివిగా తప్పించుకుంది.ఆమె చేసిన పని తెలిస్తే శబాష్ అంటారు.ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

ఆమె పేరు నమ్యా బెయిడ్‌.ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేయడంలో భాగంగా తన ఫోన్ నంబ‌ర్‌ను తెలిసిన‌వారికి ఇచ్చింది.

ఏదైనా జాబ్ ఉంటే చెప్ప‌మ‌ని వారికి చెప్పింది.దీంతోపాటు ప‌లు ఆన్‌లైన్ జాబ్ సైట్ల‌లోనూ తన రెజ్యూమ్‌తోపాటు తన ఫోన్ నంబ‌ర్‌ను కూడా ఇచ్చింది.

అంత బాగానే ఉంది అనుకున్న టైం కి ఒక వ్య‌క్తి నుంచి న‌మ్యాకు ఫోన్‌కు వ‌చ్చింది.అత‌ను త‌న‌ను తాను దీప‌క్ అనే పేరుతో ప‌రిచ‌యం చేసుకున్నాడు.

తాను ఎయిర్ ఫ్రాన్స్ ఉద్యోగిన‌ని, న‌మ్యాకు జాబ్ వ‌చ్చేలా చేస్తాన‌ని చెప్పాడు.

జాబ్ అవసరం ఉండటంతో అతన్ని నమ్మి సరే అని చెప్పింది నమ్య.

ఆ వ్య‌క్తి నెమ్మ‌దిగా న‌మ్యాతో మాట‌లు క‌లిపాడు.వాట్సాప్ లో ఆమెతో సంభాష‌ణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టాడు.

చివ‌ర‌కు ఓ రోజున ఆమెకు వాట్సాప్ లో అస‌భ్య‌క‌రంగా మెసేజ్ పెట్టాడు.

దీపక్ అనే అతను నమ్యను నగ్నంగా కనిపించే అని మెసేజ్ పెట్టాడు.అస‌భ్య‌క‌ర డ్రెస్సులు వేసుకుని ఫొటోలు దిగి పంపాల‌ని, న‌గ్నంగా మారి రూమ్‌లో ఎవ‌రూ లేకుండా చూసి వాట్సాప్ లో వీడియో కాల్ చేయాల‌ని చెప్పాడు.దీంతో న‌మ్యాకు అనుమానం వ‌చ్చింది.

అత‌ను ఫేక్ అని గుర్తించింది.చివ‌ర‌కు అత‌నితో వాట్సాప్ సంభాష‌ణ‌ను క‌ట్ చేసింది.

అయిన‌ప్ప‌టికీ అత‌ను ఆమెతో మరింత మాట్లాడేందుకు య‌త్నించాడు.

ఇక చిరాకు వచ్చి వాట్సాప్ సంభాషణల ఆధారంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది నమ్య.

మహిళలు జాగ్రత్తగా ఉండటం మంచిది.చూసారు కదా ఆ నీచుడు ఎలాంటి స్కెచ్ వేశాడో.

ఈ సంఘటనను ఆమె ఫేస్బుక్ లో షేర్ చేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube