జియో కొత్త ఆఫర్ గురించి కొత్త సమాచారం

రిలయన్స్ జియో తీసుకొచ్చిన వెల్కం ఆఫర్ మరికొన్ని రోజుల్లో, అంటే డిసెంబర్ 3వ తేదిన ముగిసిపోతుంది.కాని ఉచిత సర్వీసులు మాత్రం డిసెంబర్ 31వ తేదివరకు కొనసాగుతాయని అంబాని ఇప్పటికే ప్రకటించారు.

 Jio To Come Up With A New Welcome Offer ?-TeluguStop.com

కాబట్టి పాత వినియోగదారులు కాని, కొత్త వినియోగదారులు కాని, ఈ ఏడాది చివరివరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.కాని ఆ తరువాత ఏంటి ?

జియో ఉచిత సర్వీసులు మరో మూడు నెలలు, అంటే మార్చి 31వ తేదీవరకు కొనసాగుతాయని వార్తలైతే వస్తున్నాయి.కాని అందులో నిజమెంతో ఇప్పుడే చెప్పడం కష్టం.అలాగే ఉన్న ఆఫర్ మరో మూడు నెలలు పొడిగించడానికి ట్రాయ్ ఒప్పుకోకపోవచ్చు.ఇప్పటికే ఇతర టెలికాం కంపెనీలు జియో మీద చర్యలు తీసుకోవాలని, ఉచిత సర్వీసులు ఆపు చేయించాలని ట్రాయ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి.మరి జియో ఏం చేస్తుంది?

పెయిడ్ సర్వీసులు ఇప్పుడే తీసుకురావడం కష్టం.ఎందుకంటే జియో సర్వీసుల మీద జనాలు పూర్తీ సంతృప్తిగా లేరు.మరి ఏం చేయాలి ? టెక్ ట్రేడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, మరో కొత్తరకమైన ఆఫర్ ని అందించేందుకు ప్లాన్ చేస్తోందట జియో.ట్రాయ్ ఒత్తిడి తగ్గించేందుకు, కొత్త పేరుతొ ఈ ఆఫర్ రావొచ్చని అంటున్నారు.అలాగే ప్రస్తుతం ఉన్న జియో యూజర్లకి కాకుండా, కొత్త యూజర్లకే ఆ ఆఫర్ వాడే వీలు ఉండవచ్చు అనే రూమర్ కూడా వినిపిస్తోంది.

అయితే, ప్రస్తుతం జియో వాడుతున్నవారు అప్పుడే ఆందోళనకి గురి కావద్దు.జియో మరో వారం-పది రోజుల్లో కొత్త ఆఫర్ మీద ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

అప్పటివరకు వేచి చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube