ఇకపై జియో ఔట్‌ గోయింగ్‌ కాల్‌ చార్జీలు  

Jio Outgoing Call Charges Applied-jio To Jio Calls And Give The Data,jio Troy

భారత టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో మెల్లగా వినియోగదారులకు వాతలు పెడుతూ వస్తోంది.మొదటి ఏడాది పాటు పూర్తి ఉచితంగా డేటాను, కాల్స్‌ను ఇచ్చిన జియో ఆ తర్వాత డేటా రేట్లను నిర్ణయించింది.

Jio Outgoing Call Charges Applied-jio To Jio Calls And Give The Data,jio Troy-JIO Outgoing Call Charges Applied-Jio To Jio Free Calls And Give The Data Troy

కేవలం డేటాకు మాత్రమే డబ్బులు తీసుకుంటాం, కాల్స్‌కు తాము అస్సలు డబ్బులు వసూళ్లు చేయమంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్న జియో ట్రాయ్‌ ఒత్తిడి మేరకు వినియోగదారుల నుండి కాల్‌ చార్జీలు వసూళ్లు చేసేందుకు సిద్దం అవుతోంది.

Jio Outgoing Call Charges Applied-jio To Jio Calls And Give The Data,jio Troy-JIO Outgoing Call Charges Applied-Jio To Jio Free Calls And Give The Data Troy

ఇప్పటి వరకు జియో నుండి జియోకు లేదా ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌ చేస్తే ఎలాంటి కాల్‌ చార్జీలు ఉండేవి కావు.

కాని ఇప్పుడు కాల్‌ చార్జీలు ఉండబోతున్నాయి.నిమిషానికి 6 పైసల చొప్పున వసూళ్లు చేయబోతున్నట్లుగా జియో ప్రకటించింది.కాల్‌ చార్జీల రూపంలో వినియోగదారుల నుండి తీసుకున్న డబ్బులను తిరిగి వారికే డేటా రూపంలో ఇస్తామంటూ జియో ప్రకటించింది.మొత్తానికి జియో వినియోగదారులకు ఇదో పెద్ద బ్యాడ్‌ న్యూస్‌గా చెప్పుకోవచ్చు.