జియో మరో సంచలనం..డేటా లిమిట్‌ లేకుండానే..

దిగ్గజ రిలయన్స్‌ జియో మరో సంచలన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.దీనికి ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ లేకపోవడంతో పాటు అధికంగా వ్యాలిడిటీ ఉంటుంది.

 Jio Introduces Five New No Data Limit Plans-TeluguStop.com

ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటించే టెలికాం దిగ్గజం జియో మరో సారి సరికొత్త ప్లాన్లను తీసుకువచ్చి తన ప్రత్యేకతను చాటింది.

డైలీ డేటా లిమిట్‌తో ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త తెలిపింది.జియో ఫ్రీడం ప్లాన్ల పేరుతో ఐదు కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.

 Jio Introduces Five New No Data Limit Plans-జియో మరో సంచలనం..డేటా లిమిట్‌ లేకుండానే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులు ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ ఉండదు.ప్లాన్‌ అందించే మొత్తం డేటా అయిపోయే అంతవరకు నిరంతరాయంగా వాడుకోవచ్చు.

ప్లాన్‌ గడువు ముగిసే వరకు కూడా అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ల వ్యాలిడిటీ సైతం గతంలో మాదిరిగా 14, 28, 56, 84 రోజులు కాకుండా 15, 30, 60, 90, 365 రోజులు ఉండనున్నాయి.

ప్లాన్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జియో రూ.127 ప్లాన్‌ ఈ ప్లాన్‌ తో రీఛార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు 15 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ 12 జీబీ డేటా లభిస్తుంది.దీనికి ఎలాంటి డేటా లిమిట్‌ ఉండదు.15 రోజుల పాటు ఈ డేటాను వినియోగించుకోవచ్చు.దీంతో పాటు జియో యాప్స్‌ కు ఉచితంగా సభ్యత్యం లభిస్తుంది.జియో రూ.247 ప్లాన్‌తో రిఛార్జ్‌ చేసుకున్న వారికి 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు 25జీబీ డేటా లభిస్తుంది.ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ ఉండదు.

జియో యాప్స్‌ కూడా ఫ్రీ సబ్‌ స్క్రిప్షన్‌ లభిస్తుంది.జియో రూ.447 ప్లాన్‌..ఈ ప్లాన్‌ 60 రోజుల వ్యాలిడిటీతో 50 జీబీ డేటా అందిస్తుంది.అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ తో పాటు ఎలాంటి డేటా లిమిట్‌ ఉండదు.జియో రూ.597 ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ మూడు నెలలు ఉంటుంది.75 జీబీ డేటాను వ్యాలిడిటీ ముగిసే వారకు ఎలాంటి డేటా లిమిట్‌ లేకుండా వాడుకోవచ్చు.అన్‌ లిమటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ సదుపాయం ఉంటుంది.జియో ఉచిత సబ్‌ స్క్రిప్షన్‌ ఉంటుంది.రూ.జియో 2397 ప్లాన్‌తో వినియోగదారులకు ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ లేకుండా 365 జీబీ డేటా లభిస్తుంది.ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులు.అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ తో పాటు జియో యాప్స్‌ కు ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది.

#Jio Apps Free #247 Plan #JioSpecial #UnlimitedVoice #365 Days Pack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు