జియో నష్ట నివారణ చర్యలు

జియోను ఆరంభించిన సమయంలో ముఖేష్‌ అంబానీ ఇకపై డేటాకు వినియోగదారులు చెల్లిస్తే చాలు ఇన్‌ కమింగ్‌ మరియు ఔట్‌ గోయింగ్‌ ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించాడు.కాని ఇంటర్‌ కనెక్ట్‌ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి 6 పైసలు వసూళ్లు చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు అంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 Jio Announce The New Offers-TeluguStop.com

ముఖేష్‌ అంబానీ మాట తప్పాడని కామెంట్స్‌ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో జియో వెనక్కు తగ్గింది.

జియో తమ వినియోగదారులకు కొత్త రీచార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకు రావడంతో ఇంటర్‌ కనెక్ట్‌ యూజర్‌ చార్జీలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.జియో తీసుకు వచ్చిన కొత్త ప్లాన్స్‌ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

కొత్త ప్లాన్స్‌ ప్రకారం నెలకు 222, రెండు నెలలకు 333, మూడు నెలలలకు 444 ప్లాన్స్‌ తీసుకు వచ్చింది.ఈ ప్లాన్‌ ప్రకారం రోజుకు 2 జీబీ డేటా రావడంతో పాటు నెలకు వెయ్యి నిమిషాల ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌ వస్తాయి.

అంతకు మించి కాల్స్‌ చేస్తే అప్పుడు నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీ చేయబోతున్నారు.ఈ కొత్త ప్లాన్స్‌తో జియో వినియోగదారులకు మళ్లీ సంతోషాన్ని పంచిందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube