అమెరికన్లమే..కానీ!!!

భారత్ గురించి, అమెరికా గురించి లూసియాన గవర్నర్ బాబీ జిందాల సంచలన వ్యాఖ్యలు చేశారు.బాబీ జిందాల్ వలసవాది అని, వంశమూలాలు అమెరికా భూభూగంలోనివి కాదని ఆయన పైన విమర్శలు వస్తున నేపధ్యంలో ఆయాన స్పంధిస్తూ…తన తల్లిదండ్రులు నాలుగు దశాబ్దాల క్రితం భారత్ నుండి అమెరికాకు వచ్చారని, అమెరికన్స్‌గా ఉండేందుకు వచ్చామని, ఇండియన్ అమెరికన్స్‌గా ఉండేందుకు కాదని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 Jindal Shouts On Media About His Nativity-TeluguStop.com

అంతేకాకుండా వారికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రాంతం కాదని, ఒక ఆలోచన అన్నారు.మనం అమెరికన్లుగా ఉండేందుకు ఇక్కడకు వచ్చామని, ఇండియన్ – అమెరికన్లుగా ఉండేందుకు రాలేదని తన తల్లిదండ్రులు చెప్పారన్నారు.

భారతీయులుగా ఉండాలని భావిస్తే తాము అక్కడే ఉండేవారమన్నారు.అంతమాత్రాన భారత్ అంటే అయిష్టం కాదని చెప్పారు.

మరిన్ని అవకాశాల కోసం, మరింత స్వాతంత్ర్యం కోసం తమ తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చారన్నారు.అమెరికాలో ప్రవాసులు అనే దానిని తాను విశ్వసించనని చెప్పారు.

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనాలు సృష్టిస్తుంది.మరి ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube