మారు వేషంలో అమెరికా ఫస్ట్ లేడీ...అందరిని ఫూల్స్ చేసేసింది

ఏప్రియల్ నెల వచ్చిందంటే చాలు మొదటి రోజే ఎంతో మంది తమ స్నేహితులను , సన్నిహితులను ఫూల్స్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు.ఏప్రియల్ ఫూల్స్ డేను పండుగలా చేసుకునే వారు కూడా లేకపోలేదు.

 Joe Biden Wife Jill Biden Prank On Staff And Media On April Fools Day,  April Fo-TeluguStop.com

ఒకరిని ఒకరు ఆటపట్టిస్తూ, ఫూల్స్ చేసుకుంటూ ఎంతో కోలాహలంగా ఉంటుంది.ఈ ఏప్రియల్ ఫూల్ ను సెలబ్రిటీలు మొదలు, చిన్న , పెద్దా తేడా లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇందులో అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బిడెన్ నేనేమి మినహాయింపు కాదని నిరూపించారు.

అమెరికా అధ్యక్షుడు బిడెన్ సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ అయిన జిల్ బిడెన్ అందరిని ఏప్రియల్ ఫూల్ చేశారు.

మారు వేషంలో సర్వర్ గా పనిచేసి టీ, కాఫీ లు అందిస్తూ ఒక్క సారిగా అందరిని షాక్ కు గురిచేశారు.కాలిఫోర్నియా పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో విమానంలో ఉన్న సిబ్బందిని ఆమె ఫూల్స్ ని చేశారు.

అచ్చం ఎయిర్ హాస్టర్ బ్లాక్ డ్రెస్ వేసుకుని తలకు నల్లని విగ్గు పెట్టుకున్న ఆమె అచ్చం ఎయిర్ హాస్టర్ లా కనిపించారు.

Telugu April Fools Day, Jill Biden, Joe Biden, Joebiden-Telugu NRI

బ్లాక్ మాస్క్ పెట్టుకున్న జిల్, ఒక చేత్తో టీ, పట్టుకుని, మరొక చేత్తో ఐస్ క్రీమ్ ఉంచుకుని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కు , విమాన సిబ్బందికి సర్వీస్ చేశారు.తరువాత కాసేపటికి అదే డ్రెస్ తో ప్రెస్ సెక్షన్ కి వెళ్ళిన ఆమె తన విగ్గు, మాస్క్ తీసేసి ఏప్రియల్ ఫూల్ అంటూ అందరిని ఆట పట్టించారు.ఈ పరిణామంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.

తమకు సర్వీస్ చేసింది ఫస్ట్ లేడీనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకూ ఇలా సరదాగా ఉన్న ఫస్ట్ లేడీని మేము చూడలేదని, ఆమె మంచి మనసుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇలా ఫూల్స్ ని చేయడం జిల్ కి కొత్త కాదట, బిడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆమె ఇలానే అందరిని ఫూల్స్ ను చేసేవారని సన్నిహితులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube