అమ్మ బాబోయ్ : ఐఏఎస్ కమ్మని సిటీ కి పంపిస్తే ఈ యువతి ఏకంగా...

ఈమధ్య కాలంలో కొందరు అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు.కాగా తాజాగా ఓ యువతి ని చదువుకొమ్మని సిటీకి పంపిస్తే పరీక్షల్లో ఫెయిల్ అయ్యి చివరికి నకిలీ పత్రాలు సృష్టించి తన తల్లిదండ్రులను మోసం చేసిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Jharkhand Police Arrested Fake Lady Ias-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే మౌనిక అనే యువతి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఇటీవలే మౌనిక యూపీఎస్సీ పరీక్షలను రాయడంతో ఫెయిల్ అయింది.

అయినప్పటికీ తన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అర్థం చేసుకొని మరోమారు ప్రయత్నించమని చెబుతూ చదువుకోవడానికి మోనిక ని జార్ఖండ్ రాష్ట్రానికి పంపించారు.అయితే తర్వాత నోటిఫికేషన్ లో కూడా మౌనిక కి ఉద్యోగం రాలేదు.

 Jharkhand Police Arrested Fake Lady Ias-అమ్మ బాబోయ్ : ఐఏఎస్ కమ్మని సిటీ కి పంపిస్తే ఈ యువతి ఏకంగా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తన తల్లిదండ్రుల పరువు పోతుందని మౌనిక ఏకంగా తనకు తానుగా డిప్యూటీ కలెక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతోంది.అంతేకాకుండా ఈ ఉద్యోగానికి సంబంధించిన నకిలీ పత్రాలు అలాగే పలు సంతకం స్టాంపులు వంటివి కూడా సృష్టించింది.

ఈ క్రమంలో మౌనిక నివాసం ఉంటున్న ఇంటి యజమానికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు.

దీంతో మౌనిక ని అదుపులోకి తీసుకొని విచారించగా తాను యూపీఎస్సీ పరీక్షలలో ఫెయిల్ అయ్యానని దీంతో ఈ విషయం తన కుటుంబ సభ్యులకు మరియు బంధువులకి తెలిస్తే తన పరువు పోతుందని అందువల్లనే డిప్యూటీ కలెక్టర్ అని అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నానని నేరం అంగీకరించింది.

దీంతో మౌనిక ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

#Lady IAS #JharkhandPolice #FakeLady

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు