పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా మరో రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ కొనసాగింపు!

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం తో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాక్ డౌన్ ను జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 Jharkhand To Extend Lockdown , July 31st, West Bengal, Corona Cases,state Cms, L-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా మరోరాష్ట్రం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా లాక్‌డౌన్‌ను జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు జార్ఖండ్ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తాము లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం తెలిపారు.లాక్ డౌన్ సందర్భంగా రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు.

ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడంతోపాటు అందరూ మాస్క్ లు ధరించాలని ముఖ్యమంత్రి కోరారు.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,262కు చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది.

దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదుసార్లు లాక్ డౌన్ ను పొడిగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
జూన్ 30 తో కేంద్రం విధించిన లాక్ డౌన్ కూడా ముగియనుంది.

అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పెరుగుతుండడం తో ఆయా రాష్ట్రాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.జులై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే కేసులను కొంతమేరకు అయినా కంట్రోల్ చేయొచ్చు అని ఆయా రాష్ట్రాల సీఎం లు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube